Monday, May 13, 2024
- Advertisement -

రాహుల్ దెబ్బకు సీనియర్ లు దిగి వచ్చారా.. సోనియా కి పట్టం..!!

- Advertisement -

శతాబ్దానికి పైగా రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కి గతంలో ఎన్ని సంక్షోభం పార్టీ అధ్యక్షుని విషయంలో ఏర్పడింది..గతంలో రాహుల్ గాంధీ ని అధ్యక్షుడిగా చేసినా ఎన్నికల్లో ఓటమి, అవమాన భారంతో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు.. దాంతో తాత్కాలిక అధ్యక్షునిగా సోనియా గాంధీ ఉన్నారు.. అయితే పార్టీ రోజు రోజు కి అంతరించి పోయే స్థితి కి రావడంతో సీనియర్ లీడర్లు సోనియా కి ఈ విషయంపై ఓ లేఖ రాశారు..దాంతో సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిన్న నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పలువురు నేతలతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు..

ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రాగ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై సుదీర్ఘ చర్చ జరిగింది.. ఫలితంగా మళ్ళీ సోనియా గాంధీనే అధ్యక్ష పదవి ని చేపట్టే విధంగా కమిటీ సమావేశం తీర్మానించింది. ఇక సమావేశం మొదలు కాగానే, రాహుల్ గాంధీ లేఖ లో రాసిన ఒక్కో పాయింట్ ని వేలెత్తి చూపిస్తూ లేఖ రాసిన వారి నోర్లు మూయించారు. పార్టీ కి అండగా ఉండాల్సిన టైం లో ఇలా బీజేపీ తో కలిసి కుమ్మక్కయి లేఖలు రాసి పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారని మండిపడ్డారు. దీంతో సీనియర్ లు నొచ్చుకున్నారు. ఇదే విషయాన్నీ కపిల్ సిబల్ ట్వీట్ చేయగా, గులాం నబీ ఆజాద్ రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు..

సీనియర్ ల అసంతృప్తి హైలైట్ కావడంతో కాసేపటికే కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. సీనియర్ లతో రాహుల్ వ్యక్తిగతంగా మాట్లాడారు. దాంతో కపిల్ సిబల్ , ఆజాద్ లు మాట మార్చారు. రాహుల్ గాంధీ తమని బీజేపీ తో కుమ్మక్కయ్యామని అనలేదని చెప్పడం ప్రారంభించారు. రాహుల్ గాంధీ తనతో తన తో వ్యక్తిగతంగా మాట్లాడారని..ప్రచారం జరుగుతున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేయలేదని సిబల్ ప్రకటించారు. సమావేశంలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలేం చేయలేదని అధికార ప్రతినిధి సూర్జేవాలా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాత్రమే ఆయన నిలదీశారని రాహుల్ వ్యాఖ్యలు సీనియర్లను నిలదీసేలా, అవమానించేలా ఉన్నాయనడం సరికాదని అన్నారు.. ఆజాద్ కూడా తాము బీజేపీ తో కుమ్మక్కయ్యామని అనలేదని ప్రకటించారు. లేఖ పై ఎక్కువ చర్చ జరగడంతో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి నిర్ణయం వాయిదా పడింది.. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే వరకు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని సమావేశం తేల్చింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -