- Advertisement -

ఇంత ఘోరం ఎప్పుడూ చూడ‌లే..!

- Advertisement -

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చోటుచేసుకున్న పరిణామాలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. “ఇంత ఘోరం ఎప్పుడూ చూడలేదు.. ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదు” అంటూ శివ భక్తులు, శివ స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఎదురుచూస్తున్నప్పటికీ, శివయ్య దర్శన భాగ్యం కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పిల్లలతో, వృద్ధులతో వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేవని మండిపడుతున్నారు. తాగునీరు, నీడ, విశ్రాంతి ఏర్పాట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. దర్శనానికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులను పట్టించుకోకుండా అధికారులు వీఐపీల సేవలకే పరిమితమవుతున్నారని విమర్శలు చేస్తున్నారు.

భక్తులు ప్రశ్నిస్తే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. శాంతియుతంగా తమ సమస్యలు చెప్పుకుంటే కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు శివ స్వాములు ఆవేదన వ్యక్తం చేశారు. “మీకో దండం.. ఇదేనా ఆలయాన్ని నడిపించే తీరు?” అంటూ అధికారుల పనితీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భక్తుల బాధలు పట్టించుకునే వారు లేరా? ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు గౌరవం, భద్రత, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, వెంటనే పరిస్థితిని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమ నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -