Saturday, May 4, 2024
- Advertisement -

ఆ నలుగురిపై పిడుగు పడింది.. కానీ..

- Advertisement -

వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవ్వరికీ తెలియదు. నిజమే మృత్యువు ఏ క్షణంలో మనల్ని వెంటాడుతుందో ఎవరూ చెప్పలేరు. గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్ ఓ పార్కు వద్ద వర్షం వస్తుందని తలదాచుకోవాలని చూసిన ఓ నలుగురు తోటమాలీలపై  వేల వోల్టుల శక్తి ఉన్న పిడుగు మీదొచ్చి పడింది. దాంతో ఆ నలుగురు అక్కడే కుప్పకూలిపోయారు. నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

ఈ నేపథ్యంలో గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్ వద్ద గల పార్కులో ఓ నలుగురు తోటమాలీలు నేద  ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. వాళ్లు వెళ్లి అలా నిలబడ్డారో లేదో.. కాసేపటికే ఆ చెట్టుపై ఓ రాకాసి పిడుగు వచ్చి పడింది.  దాంతో నలుగురూ అక్కడికక్కడే కూలిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు  ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు.  మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని ఉద్యానవన పనులు చేసే సిబ్బంది అని గుర్తించారు. బాధితులను శివదత్, లాలి, రాంప్రసాద్ సుందర్, అనిల్ గా గుర్తించారు.  గత ఏడాది జూన్ లో పిడుగులు పడిన ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క బీహార్ లోనే 82 మంది చనిపోయారు.

ఈ దృశ్యాలు చెట్టుకు ఎదురుగా ఉన్న ఓ ఇంటి ముందు పెట్టిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.  వాన పడుతున్న సమయంలో నలుగురు చెట్టుకిందకు వెళ్లి నిలబడడం.. కాసేపటికే మెరుపులా అదే చెట్టుపై పిడుగు పడడంతో నలుగురు బొమ్మల్లా కుప్పకూలిపోయిన దృశ్యాలు చాలా స్పష్టంగా రికార్డయ్యాయి.  అందుకే వర్షాలు పడే సమయంలో చెట్టు కింద నిలబడటం చాలా ప్రమాదం అని ఈ దృశ్యాలే సాక్షం అంటున్నారు.

https://twitter.com/DilipDwivedi__/status/1370603473033588736?s=20

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -