- Advertisement -

ముఖ్యమంత్రి ని చంపడానికి ప్రయత్నించిన వారిని ఏం చేసారు

- Advertisement -
suspense Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణం చేస్తున్న విమానం ల్యాండింగ్ కి సంబంధించి తీవ్రమైన అలజడి రేగిన సంగతి తెలిసిందే. ఆమె డిల్లీ నుంచి కోల్ కథా చేరుకున్న ఇండిగో విమానం 15 నిమిషాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యింది.

నవంబర్ 30న బీహార్ లోని ఓ ర్యాలీలో పాల్గొన్న అనంతరం పాట్నా నుంచి సాయంత్రం 7.30కి మమత తిరుగుపయనమయ్యారు. కోల్ కతాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే… మమత ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ ఆర్డర్ లో 8వ స్థానంలో ఉందని ఏటీసీ నుంచి పైలట్ కు సమాచారం అందింది. అయితే, విమానంలో ఇంధనం తక్కువగా ఉందని… అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వాలని పైలట్ కోరారు. అయితే, మరో మూడు విమానాలు కూడా ఇంధనం తక్కవగా ఉందని చెప్పడంతో… మమత విమానం ల్యాండ్ కావడానికి 15 నిమిషాల తర్వాత ఏటీసీ అనుమతి ఇచ్చింది. 

దీంతో, మమతను చంపడానికి కుట్ర జరుగుతోందని పార్లమెంటు ఉభయసభల్లో తృణమూల్ సభ్యులు గందరగోళం సృష్టించారు. అయితే, మంత్రి మాట్లాడుతూ, మరో మూడు విమానాలు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు కోరడంతోనే… ఇండిగో విమానం ల్యాండింగ్ అనుమతి రావడానికి కొంచెం ఆలస్యమయిందని తెలిపారు. ఈ విషయంపై విచారణ జరిపిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్… ఆరుగుతు పైలట్లపై సస్పెన్షన్ విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -