- Advertisement -
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే తనకు ఎంతో బాధగా ఉందని, ఒకవిధంగా ఎపిని చూస్తే తనకు బిపి వస్తోందన్నట్లుగా ఉందని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ఇచ్చిన నిధులు రాష్ట్రానికి సరిపోవడం లేదని, అ విషయంపై చంద్రబాబు నాయుడు మాత్రం పెదవి విప్పడం లేదని విమర్శించారు. అఖిల పక్షాన్ని సమావేశపరచి ఢిల్లీ తీసుకువెళ్లాల్సిన చంద్రబాబు ఆ పని ఎందుకు చేయడం లేదని తమ్మినేని ప్రశ్నించారు.
మదీనాగుడాలోని చంద్రబాబు ఇంటిని ప్రజల సొమ్ముతో మరమ్మతులు చేయించుకుంటున్నారని, ఏ నాయకుడైనా ఇలా చేయవచ్చా అని ఆయన మండిపడ్డారు.
