Tuesday, May 14, 2024
- Advertisement -

అధికార పార్టీ నేతలు నిస్సిగ్గుగా నీతులు వల్లిస్తోంటే..ప్రజానీకం నివ్వెరపోవాల్సి వ‌స్తోంది..

- Advertisement -
TDP Politics in Nandyal for by election

నంద్యాల ఉప ఎన్నిక‌తో ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఎలాగైనా గెల‌వాల‌ని నిప్పు అని చెప్పుకొనే అధికార‌పార్టీ నీతుల‌కు తిలోద‌కాలిచ్చి నిస్సిగ్గు రాజ‌కీయాల‌కు తెర‌లేపుతోంది.

భూమా అక‌స్మిక మ‌ర‌ణ‌తో ఖాలీ అయిన‌ నంద్యాల నియేజ‌క‌వ‌ర్గ‌ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వెల‌వ‌డ‌నుంది.ఈఎన్నిక‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇజ్జ‌త్‌కి స‌వాల్‌గా మారింది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి …త‌ర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు.

{loadmodule mod_custom,GA1}

సాదార‌నంగా ఒక స‌ట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే …ఆస్థానం ఆపార్టీకే ద‌క్కాలి అనేది రాజ‌కీయపార్టీలు అనుస‌రిస్తున్న విధానం.అక్క‌డ ఏపార్టీ కూడా పోటీ పెట్ట‌కూడ‌దు.వాస్త‌వానికి నంద్యాల స్థానం వైఎస్సార్సీపీకే దక్కాలి. కాని టీడీపీ మాత్రం విలువ‌ల‌కు తిలోద‌కాలిచ్చిభూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపుతోంది. టీడీపీలోకి వచ్చాక భూమా నాగిరెడ్డి చనిపోయారు గనుక, ఆయన సోదరుడి కుమారుడైన భూమా బ్రహ్మానందరెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించాలన్నది తెలుగుదేశం పార్టీ వాదన.
2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నంద్యాలలో గెలిచిన స్థానం కాబ‌ట్టి.. తెలుగుదేశం పార్టీనే నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీకి నిలబడకూడదు.నైతికతకి తిలోదకాలిచ్చేసి, నీతివాక్యాలు చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. వైఎస్సార్సీపీ సహా ఏ రాజకీయ పార్టీ కూడా నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకూడదంటూ అభ్యర్థిస్తున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు.

{loadmodule mod_custom,GA2}

నీతి నిజాయితీ అని చెప్పుకొనే బాబు నిస్సిగ్గుగా నీత‌లు వ‌ల్లింస్తుంటె రాష్ట్ర ప్ర‌జానీకం ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణాలో టీడీపీ నాయ‌కుల‌ను టీఆర్ఎస్ చేర్చుకుంటె ఆ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన టీడీపీ అధినేత బాబు..ఏపీలో మాత్రం అదే రాజకీయ వ్యభిచారానే ప్రోత్సహించారు.అవినీతి రాజ‌కీయ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న బాబు చెప్పే నీతులు దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుందని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}hRvA4KMiUoQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -