- Advertisement -

వెన్న‌ముక దెబ్బ‌తిన‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతున్న బాలిక‌

- Advertisement -
Teachers Push Pak Schoolgirl From 3rd Floor For Refusing to Clean class room

స్కూల్‌కి వెల్లేది బాగా చ‌దువు కొనేదానికి…వాల్ల‌ను మంచి భ‌విష్య‌త్తు క‌లిగిన విద్యార్థ‌లుగా తీర్చి దిద్దాల్సిన బాధ్య‌త టీచ‌ర్ల‌దే.కాని ఆటీచ‌ర్లు మాత్రం అలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.టీచ‌ర్లంతా త‌ల‌దించుకొనే ప‌నిచేశారు.

క్లాస్‌ను శుబ్రం చేయ‌న‌న్నందుకు తొమ్మిదవ తరగతి విద్యార్థినిని టీచ‌ర్లంతా క‌లిసి స్కూలు పై అంతస్తుపైకి తీసుకెళ్లి మ‌రీ అక్క‌డి నుంచి కింద‌కు తోసేశారు. దీంతో ఆ విద్యార్థినికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆమె వెన్నెముక కూడా విరిగిపోయిందని, ప్ర‌స్తుతం ఆ అమ్మాయి ఆసుప‌త్రిలో చావుబ‌తుకులతో పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘ‌ట‌న పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, ఫజ్జర్ నూర్ (14) అనే ఆ బాలిక లాహోర్ నగరంలోని ఓ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటోంది. తరగతి గదులను ప్రతిరోజూ ఒక్కో విద్యార్థినితో టీచ‌ర్లు శుభ్రం చేయిస్తారు. మే 23న ఫజ్జర్ వంతు రావ‌డంతో ఆమెను శుభ్రం చేయ‌మ‌ని చెప్పారు. ఆరోజు త‌న‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో త‌న ప‌నిని మరోరోజు చేస్తానని ఆ బాలిక తెలిపింది. దీంతో ఆ బాలిక‌ను టీచ‌ర్లు చెంపల మీద కొట్టి, ఆ తర్వాత మూడవ అంతస్తు పైకి తీసుకెళ్లి అక్కడున్న గదిని శుభ్రం చేయమని బెదిరించారు. ఆ అమ్మాయి ఒప్పుకోక‌పోవ‌డంతో అక్కడి నుంచి తోసేశారు. ఈ చర్యకు పాల్పడిన టీచర్లు రెహానా కౌసర్, బుష్రా తుఫైల్ అనే ఇద్దరిపై హత్యాయత్నం కేసు న‌మోదైంది.

{loadmodule mod_custom,Side Ad 2}

అయితే ఈసంఘ‌ట‌న మే 23వ తేదీనే జరిగినా, దాన్ని స్కూలు యాజమాన్యం దాచిపెట్టిందని పంజాబ్‌ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అల్లాబక్ష్ మాలిక్‌ చెప్పారు. ఎట్టకేలకు పోలీసులకు విషయం తెలియడంతో వాళ్లు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీని ముఖ్యమంత్రి నియమించారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి తన కూతురిని చూడాలని, ఆమె బాధ తట్టుకోలేకపోతోందని ఫజ్జర్ తల్లి రుఖ్సానా బీబీ అన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}kF8Yeeo93eI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -