Sunday, May 12, 2024
- Advertisement -

రాజీనామ చేశాకె.. చ‌క్ర‌పాణిని పార్టీలోకి చేర్చుకున్నప్ర‌జానేత‌

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలోనైనా కొనసాగే హక్కు, వద్దనుకుంటే మరో పార్టీలో చేరే హక్కు ఉన్నాయి. ఒకే పార్టీలో కొనసాగాలా, పార్టీ మారాలా అనేది రాజకీయ పరిస్థితి, పరిణామాలబట్టి ఉంటుంది. వరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయించేటప్పుడు కనీస నైతిక విలువలు పాటించడం ధర్మం. బాధ్యత కూడా. ఏమిటా ధర్మం? పార్టీ మారేటప్పుడు ఆ పార్టీకి, దాని ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నిక‌వ‌డం ధర్మం.

కాని ఏపీలో మాత్రం నైతిక విలువ‌ల‌కు అధికార పార్టీ తిలోద‌కాల‌చ్చింది. కాపా గుర్తు మీద గెలిచిన వారితో కనీసం రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలన్న స్పృహ కూడా లేకుండానే.. తెలుగుదేశం ప్రభుత్వంలో వారిని మంత్రులుగా కూడా తీసుకున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి అడ్డ‌గోలు పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.

ఇలాంటి అనైతిక ఫిరాయింపుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పట్టువదలని పోరాటం సాగిస్తోంది. అటు స్పీకరుకు తరచుగా ఫిర్యాదులు చేయడంతోపాటూ, న్యాయస్థానంలో కూడా కేసు నడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే జగన్ ఆయన విషయంలోనూ తాను నమ్మిన నైతిక విలువలను పాటించడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

శిల్పా చక్రపాణిని ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిందిగా, జగన్ కోరినట్లు సమాచారం. ఫిరాయింపుల గురించి తాము తెలుగుదేశం పార్టీని ఏ రకంగా తప్పుపడుతున్నామో.. అలా ఈ ఒక్క ఎమ్మెల్సీ పదవి గురించి తమను ఎవ్వరూ మాటలు అనే పరిస్థితి రాకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.అందుకే రాజీనామాను చేయ‌లన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, అధికార తెలుగుదేశంలో చేరిపోయారు. పదవుల దగ్గరినుంచి కాంట్రాక్టు పనుల వరకు వీరికి రకరకాల ప్రలోభాలు చూపించారంటూ ఆరోపణలు వినిపించాయి. అయితే ఏ ఒక్కరు కూడా తమ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామాలు చేయలేదు.

ఇలాంటి సమయంలో.. తెదేపా నుంచి వచ్చిన చక్రపాణి ఎమ్మెల్సీ పదవిలో కొనసాగితే.. ఆ ఒక్క పదవి కోసం తమ పోరాటం పలచబడుతుందని… తమకు ప్రజల నైతిక మద్దతును కూడగట్టుకోవాలంటే.. ఆయనతో పదవికి కూడా రాజీనామా చేయిస్తే బాగుంటుందని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి.అందుకే జ‌గ‌న్‌ను మ‌గాడ్రా బుజ్జి అంటున్నారు. నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డిన జ‌న‌నేత జ‌గ‌న్‌. మ‌రి చంద్ర‌బాబు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -