Friday, April 19, 2024
- Advertisement -

చేతి వేళ్ళకు దేవుడి ఉంగరాలను ఎలా ధరించాలో తెలుసుకోండి.. లేకపోతే డేంజరే

- Advertisement -

కొంతమంది ఉంగరాలను స్టైల్ కోసం ధరిస్తుంటే మరి కొంతమంది జాతకం ప్రకారం రకరకరాల స్టోన్స్ ఉన్న ఉంగారాలను ధరిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం భక్తితో దేవుడి ఉంగారలను ధరిస్తుంటారు.

ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటారు. అయితే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలను ధరించడంలో కొన్ని పద్దతులను పాటించాలని, లేకపోతే నెగిటివ్ రిజల్స్ వస్తాయని పండితులు చెబుతున్నారు.

ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ తల మన మణికట్టు వైపు, దేవుని కాళ్ళు మన గోర్ల వైపు ఉండేలా ధరించాలి. ఎందుకంటే, మన శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. ఉంగరాలని కళ్ళకు అద్దుకునేటప్పుడు చేసి గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. ఇక మహిళలు అయితే ఇబ్బందిరోజుల్లో దేవుడి ఉంగారలను ధరించరాదు.  అలాగే భోజనం చేసేటప్పుడు ఉంగారానికి ఎంగిలి అంటకూడదు. ఇక ధూమపానం చేసేటప్పుడు, ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. ఇటువంటి  జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ కల ఉంగరాన్ని ధరించాలని లేకపోతే మనకు మంచి జరగకపోగా చెడు జరిగే ప్రమాదం ఉందని పండితులు హెచ్చిరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -