Thursday, May 2, 2024
- Advertisement -

అంతు చిక్క‌ని మోదీ, అమీత్‌షా వ్యూహాలు

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమీత్‌షా వ్యూహాలు ఎవ‌రికి అంతు ప‌ట్ట‌వు అనేది అంద‌రికి తెలిసిందే . ఇప్పుడు తాజాగా కేంద్ర‌మంత్రి వ‌ర్గ పుణ‌ర్ వ్య‌వ‌స్థీక‌ణ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు చోటు చేసుకున్నాయి. కారు,క‌మ‌ళం దోస్తీ క‌ట్ట‌నున్నాయి. గ‌త కొంత‌కాలంగా వ‌స్తున్న ఊహాగానాలు తెర‌ప‌డింది. టీఆర్ఎంపీ క‌విత‌కు అనూహ్యంగా కేంద్ర‌మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

కేంద్ర మంత్రి వ‌ర్గ‌విస్త‌ర‌ణ‌లో జెడి.యు , అన్నాడిఎంకె పార్టీలకి మాత్రమె కేంద్ర మంత్రివర్గ విస్తరణ లో చోటు దక్కుతోంద‌నె వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇలాంటి స‌మ‌యంలో కేసీఆర్ రంగంలోకి దిగి చ‌క్రం తిప్పార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. త‌న కూతురుకోసం భారీగానె అబీయింగ్ చేశార‌ని తెలుస్తోంది. కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి తో కలిసి పనిచేయడానికి తెరాస సిద్ధమేనని మోది, అరుణ్ జైట్లీలకి చెప్పడం తో ఢిల్లీ సీన్ మారిపోయిందని తెలుస్తోంది.

మొద‌టినుంచి బిజెపి సీనియర్ నేత మురళీధర రావుకి మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌నె వార్త‌లు బ‌లంగా వినిపించాయి. టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటె అకులానికి చెందిన ముర‌ళీధ‌ర రావుకి దక్కాల్సిన మంత్రిపదవి అదే కులానికి చెందిన కవితకు దక్కనుంది. కంటి అప‌రేష‌ణ్ కోస‌మ‌ని ఢిల్లీ వెల్లీ వెళ్లిని కేసీఆర్ ప‌నిలో ప‌నిగా కార్య‌క్ర‌మం చ‌క్క‌బెట్టుకున్నారు.

బిజెపి కోసం జీవితాన్నిధారపోసిన దత్తాత్రేయను తప్పించి, తెరాస ను కొత్త మిత్ర పక్షంగా ఎంచుకోవడం వెనుక అమిత్ షా వ్యూహం అంతుబట్టడం లేదు. తెలంగాణాలో టీఆర్ఎస్‌ను కాద‌ని భాజాపా సొంతంగా ఎద‌గ‌లేద‌ని తెలిసే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నాయకులని కాదని, కూతురు మంత్రి పదవి కోసం కెసిఆర్ లాబీయింగ్ చేయడం శోచనీయం.

తెరాస లోనే జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ లాంటి సీనియర్ నాయకులని కాదని, కనీసం ఇతర కులాల వారికి కూడా అవకాశం ఇవ్వకుండా అన్ని పదవులు తన కుటుంబానికే ఇచ్చుకోవడం కెసిఆర్ ఇమేజ్ కి నష్టం చేయడం ఖాయం. మ‌రి కేసీఆర్ వ్యూహం ఎలా ఉందో ఆయ‌న‌కే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -