Saturday, May 4, 2024
- Advertisement -

హెచ్‌ 1బీ వీసాలపై బొక్క బోర్లా పడిన ట్రంప్..!

- Advertisement -

అగ్రరాజ్యంలో వలసలు, నిరుద్యోగాన్ని అదుపులో పెట్టేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న వీసా నిర్ణయాలకు కాలిఫోర్నియా సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. విదేశీ ఉద్యోగుల నియామకానికి సంబంధించిన హెచ్‌ 1బీ వీసాలపై అధ్యక్షుడు విధించిన ఆంక్షలను ఇక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిబంధనల అమలుకు ముందు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ట్రంప్‌ ప్రభుత్వం తగినంత సమయం కేటాయించలేదని.. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జెఫ్రీ వైట్‌ వెల్లడించారు.

అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకంటూ విదేశీ నిపుణులకు కూడా స్థానికులతో సమానంగా వేతనాలు చెల్లించాలనే నిబంధన విధించటంతో వాణిజ్య సంస్థలు ఇరుకున పడ్డాయని న్యాయమూర్తి తెలిపారు.

కొవిడ్‌-19 వల్ల ఉద్యోగాల సంఖ్యపై కోత పడిందని.. తద్వారా నిరుద్యోగం తీవ్రమయ్యే ప్రమాద ముందని ట్రంప్‌ ప్రభుత్వం వాదించింది. దీని నుంచి తప్పించుకొనేందుకు అంటూ ఈ సంవత్సరాంతం వరకు హెచ్‌ 1బీ, ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో వీసా దరఖాస్తుల సంఖ్య మూడో వంతుకు పడిపోతుందని ఆశించారు. అయితే ఈ వాదనను ట్రంప్‌ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -