Friday, April 26, 2024
- Advertisement -

కేసీఆర్ సారు.. రైతులు చావే దిక్కంటున్నారు : వైఎస్ షర్మిల

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకు వస్తానని ‘వైఎస్ఆర్ తెలంగాణ’ పార్టీతో తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లు టీ సర్కారు కి కనిపించేలా.. వినిపించేలా చేస్తా అంటున్నారు వైఎస్ షర్మిల. ఇప్పటికే నిరుద్యోగుల గురించి 72 గంటల నిరాహార దీక్ష చేసిన ఆమె ఇప్పుడు రైతు పక్షాన నిలబడ్డారు. గత కొన్ని రోజులు నుంచి తెలంగాణలో వరుసగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వ‌డ్లు త‌డిసి మొలకలొచ్చాయ‌ని క‌ల‌త చెందిన ఓ కౌలు రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసినట్లు ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను వైఎస్ ష‌ర్మిల త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి అంజయ్య ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దాంతో ఆయన పరిస్థితి విషమించడంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విష‌యాన్ని ష‌ర్మిల ప్ర‌స్తావిస్తూ.. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతూ త‌డిసిపోతుండ‌డంతో రైతులు న‌ష్ట‌పోతున్న‌ప్ప‌టికీ కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ వారి కష్టాలు ఆయనకు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వడ్లు వానకు తడిసి మొలకలస్తున్నయని, రైతులు దండాలు పెట్టినా .. రోడ్లు ఎక్కినా, సర్కారు కొంటలేదని .. చావే దిక్కని రైతు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నా .. KCR సారు కు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంటది పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా దగా పడుతున్నారు. ప్రతి గింజ ను కొంటామని చెప్తున్నప్పటికీ, ధాన్యం విక్రయాలలో జరుగుతున్న దగాని చూస్తుంటే భాదగా ఉంది. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేసి, వారికి ఎలాంటి కోతలు లేకుండా మద్దతు ధరను చెల్లించాలి అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -