Monday, May 13, 2024
- Advertisement -

యూపీ పోలీసుల వినూత్న ప్ర‌యోగం…

- Advertisement -

నిబంధనలు మన మంచికేనన్నది తెలిసి కూడా వాటిని ఉల్లంఘించటం కొంద‌రి వాహ‌ణ‌దారుల‌కు అల‌వాటుగా మారింది. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు, చ‌ర్య‌లు తీసుకున్నా పూర్తిగా ఫ‌లించ‌డంలేదు. వాహ‌న‌దారులు హెల్మెట్‌, సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం వ‌ల్లే ఎక్కువ‌గా ప్ర‌మాదాల్లో మ‌ర‌నిస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా నమోదయిన రోడ్డు ప్రమాదాల్లో 84 శాతం ఉత్తర ప్రదేశ్‌లోనే నమోదయి జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 55 శాతం హెల్మెట్‌ ధరించకపోవటంతో జరిగినవే.

రహదారి నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు లోనవుతున్న ఘటనలపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు వినూత్నంగా స్పందించారు. వాహ‌న‌దారులు అన్ని రూల్స్ పాటించేదానికి పోలీసు అధికారులు వెరైటీగా ఆలోచించారు. హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిన వారిని పట్టుకుని వారికి ఫైన్ విధించకుండా, వారి జీవిత భాగస్వాములను పిలిపించారు. ఆపై తమ డబ్బులతో హెల్మెట్లు కొనిచ్చి, నడిరోడ్డుపైనే భార్యలతో వాటిని తొడిగించి, వెరైటీగా సన్మానించారు.

కర్వా చౌత్‌ పండగ సందర్భంగా పోలీసులు ఈ పని చేయించారు. ప్రాణాలు ఎంత విలువైనవన్న విషయాన్ని భార్యలతో చెప్పించామని, సొంత నిధులను వెచ్చించి వందలాది మందికి హెల్మెట్లను బహూకరించామని లక్నో ఎస్పీ దీపక్ కుమార్ వెల్లడించారు. వారితో ఇకపై హెల్మెట్లు లేకుండా ప్రయాణించబోమని ప్రమాణం చేయించినట్టు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -