ఏపి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌పై తెలుగు దేశం పార్టీ కొత్త ఆరోపణలు లేవనెత్తుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, జగన్ కలిసి కుట్ర చేస్తున్నారని మాత్రమే విమర్శలు చేసేవారు.
కానీ ఇప్పుడు కొత్తగా మరో విమర్శను సంధించారు. అదేంటంటే మే 21వ తేదీన హైదారబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 12లో ఉన్న గ్రాండ్ సితార హోటల్లో వైసిపి అధ్యక్షుడు జగన్ కొంతమందిని కలిశారని టిడిపి ప్రధాన కార్యదర్శి పి.అనురాధ ఆరోపించారు. ఈ భేటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అసలు ఎందుకు జగన్ సితార హోటల్‌కి వెళ్ళారో చెప్పాలని, అక్కడికి వెళ్ళి ఎవరెవరితో మాట్లాడి ఈ కుట్రకు కారణం అయ్యారో బహిర్గతం చేయాలని ఆమె పేర్కొన్నారు.
అసలు టిడిపి వారు చేసే అరోపణలలో పసే లేకుండా పోతోంది. సితార హోటల్లో జగన్ ఎవరినో కలిశారు అని అంటున్న టిడిపి, వారే కనుక్కొని బహిర్గతం చేయొచ్చు కదా!. ఒకవేళ జగన్ కలిసి ఉన్నా బయటికి ఎందుకు చెప్తారు. పసలేని ఆరోపణలు, ఆధారాలు లేని ఆరోపణలు టిడిపి చేస్తూ పోతే ఇంకా నష్టపోయే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు
