విజయవాడ: నోట్ల రద్దు దేశంలో పెను సంచలనం సృంచిన సంగతి తెలిసిందే. ప్రజలు దీని వల్ల ఇబ్బందులు పడుతుండగా పలు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఢిల్లీ వెళ్లి మరీ మోడీతో భేటీ అయ్యారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి. ఈ నోట్ల రద్దుపై ఆయన వ్యవహార శైలి ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధాని నుంచి ప్రకటన వెలువడగానే మొదట పొగిడారు. తాను ప్రతిపాదన చేసిన ఈ నోట్ల రద్దు కార్యరూపం దాల్చినందుకు నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత రెండు వేల నోటు రావడం సరికాదన్నారు. దాని వల్ల బ్లాక్ మనీ మళ్లీ పెరుగుతుందంటూ దాని అవసరం లేదన్నారు. కానీ ప్రజలంతా బ్యాంకులు, ఏటిఎంల ముందు క్యూ లైన్లో నిలబడి పలు ఇబ్బందులు పడుతుండటం, వారి అసహనాన్ని వ్యక్తం చేయడం రోజు రోజుకూ పెరుగుతోంది.
దీంతో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు. తాను నోట్ల రద్దు నిర్ణయాంతో తీవ్ర అసహనానికి గురౌతున్నట్టు చెబుతున్నారు. దీంతో మొదట మెచ్చుకున్న బాబు తర్వాత ఇలా ఎందుకు మాట మార్చారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఫలితం ఎటు ఉన్నాసరే దాని ప్రభావం తనపై నెగెటివ్‌గా కాకుండా పాజిటీవ్‌గా ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తున్నారనేది ఓ వాదన. అందుకే రాష్ట్ర విభజన సమయంలో కూడా రెండు కళ్ల సిద్దాంతాన్ని అనుసరించారని పలువురు విమర్శిస్తున్నారు.
