Monday, May 20, 2024
- Advertisement -

పార్టీల‌కు ప‌ట్టుకున్న ఎన్నిక‌ల స‌ర్వే పిచ్చి

- Advertisement -
Why Political Parties Survey in telugu states..?

ఇప్పుడు దేశంలో అన్ని పార్టీలకు స‌ర్వేల పిచ్చి ప‌ట్టుకుంది.ఎన్నిక‌ల‌కు ఇంకా రెండు సంత్సరాల స‌మ‌యం ఉన్నా కోట్లు ఖ‌ర్చుపెట్టి పార్టీ స్తితిగ‌తుల‌పై స‌ర్వేలే నిర్వ‌హించుకుంటున్నాయి.

ఏ పార్టీ స‌ర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా ప‌లితాలు వ‌స్తున్నాయి. ఇది ఇప్పుడు అన్ని పార్టీల‌కు పీవ‌ర్‌గా మారింది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఒకే సారి పార్ల‌మెంట్‌,అసెంబ్లీల‌కు ముంద‌స్తు ఎన్నిక‌ల నినాదంతో ఈ స‌ర్వే పిచ్చి ప‌ట్టుకుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

స‌ర్వే పిచ్చి తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు బాగా ప‌ట్టుకుంది.ఇంకేముంది తెలంగాణాలో సీఎం కేసీఆర్‌…ఇటు ఏపీలో సీఎం చంద్ర‌బాబు సొంతంగా ఎన్నిక‌ల స‌ర్వే నిర్వ‌హించ‌కున్నారు.ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంద‌నేదానిపైనే ఈ స‌ర్వేలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది.స‌ర్వేతో కేసీఆర్ పుల్ కుషీగా ఉన్నారు.2019 ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు 111 స్థానాలు, ఎంఐఎంకు 6, కాంగ్రెస్‌కు 2 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని కేసీఆర్ స‌ర్వే వివ‌రాలు బ‌య‌ట‌పెట్టారు.అంతేకాకుండా కాంగ్రెస్ గెలిచే రెండు సీట్లు కూడా ప్ర‌క‌టించారు.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోదీ హ‌వా ప్ర‌భావం ఉండద‌ని కేసీఆర్ స‌ర్వేలో తేలింద‌ట‌. ఇటు ఎమ్మెల్యేల స‌ర్వే వివ‌రాల‌ను కూడా వారికి అందించారు. ఈ సారి ఫ‌స్ట్ ర్యాంక్ కేసీఆర్‌కే ద‌క్కింది. 98 శాతం మార్కుల‌తో ఆయన ఫ‌స్ట్ ప్లేస్ కొట్టారు. ఆ త‌ర్వాత రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్యనారాయ‌ణ రెండో ప్లేస్‌లో ఉన్నారు. మంత్రి కేటీఆర్‌కు 91 శాతం,హరీష్‌రావు 88 శాతం మార్కులు వ‌చ్చాయి.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం త‌మ‌దేన‌ని ధీమాతో కేసీఆర్ ఉన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

ఏపీలో సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హించి స‌ర్వేలో దిమ్మ‌తిరిగే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.స‌ర్వే ప‌లితాలు బాబుకు పూర్తి వ్య‌త‌రేకంగా వ‌చ్చాయి.దీంతో బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. స‌ర్వేలో బాబుకు ప్ర‌జాధ‌ర‌న త‌గ్గ‌డంతోపాటు …ఎమ్మెల్యేల గ్రాప్ కూడా ప‌డిపోయింద‌ట‌.ముఖ్యంగా ఎన్నిక‌ల్లో ఇచ్చి వాగ్దానాల‌ను అమ‌లు చేయ‌డంలో విప‌ల‌మ‌య్యారు. వీటికితోడు ప్ర‌త్యేక హోదా,రైల్వే జోన్ వంటి అంశాల‌ను టీడీపీ పూర్తిగా విస్మ‌రించింది.ఎన్నిక‌లు జ‌రుగుతే టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డం కాయ‌మ‌నే ప‌లితాలు స‌ర్వేలో వ‌చ్చాయంట‌.
అస‌లు ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయనే దానిపై ఒక క్లారిటీలేదు. ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత న్యూస్ చాన‌ల్లు,కొన్ని ఏజెన్సీలు స‌ర్వే నిర్వ‌హిస్తాయి.ఇప్పుడు వాటికంటె ముందే పార్టీలు స‌ర్వే నిర్వ‌హించుకుంటున్నారు. ఏంటో ఈస‌ర్వేల పిచ్చి వీల్ల‌కే తెలియాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}r3MajbVeypA{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -