ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది రైతుల ప్రభుత్వమని మరో సారి నిరూపించుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లుకు ఖశ్చితమైన ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ గత ప్రభుత్వం 391 మందికి మాత్రమే పరిహారం అందజేసిందని.. ఇంకా ఎవరైనా అర్హులున్నా గుర్తించి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కలెక్టర్లు స్వయంగా ఆత్మహత్య చేసుకున్న రైతుకుంటం ఇంటికి వెల్లి నష్టపరిహారాన్ని అందించాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని, ఎమ్మెల్యే లతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్ స్పందించాలని, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆ కుటుంబం వద్దకు వెళ్లాలని ఆదేశించారు
