అబద్దాలను చెప్పడంలో గోబెల్స్‌ను మించిపోయారు సీఎం చంద్రబాబు. తాను చేయని పనులను కూడా తానే చేసినట్లు మాట్లాడి గతంలో నవ్వుల పాలైన చంద్రబాబు తాజాగా మరోసారి అలాంటి పనే చేశారు. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై స్పందిస్తూ తిరుమలను ఏడు కొండలుగా గుర్తించింది తానేనని చెప్పి మరోసారి నవ్వుల పాలయ్యారు.
ఎందుకంటే వాస్తవానికి తిరుమలను ఏడు కొండలుగా గుర్తిస్తూ జీవో ఇచ్చిందే దివంగత సీఎం, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తిరుమలలో ఎన్నికలు జరగకూడదు, అన్యమత ప్రచారాలు జరగకూడదని జీవో ఇచ్చారు వైఎస్. అంతేగాదు ఆధ్యాత్మికతను కాపాడేందుకు కొండపై మాంసాహారం, మద్యం, ధూమపానం, జూదం, భిక్షాటనను నిషేధించిందీ వైఎస్‌ఆర్. ఇందుకు సంబంధించి నాడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో కాపీలను షేర్ చేస్తూ చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు నెటిజన్లు.
ఇక ఇవాళ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ఏడుకొండలు రెండు కొండలు అంటే కాదు.. తప్పని చెప్పి తిరుపతి పాదయత్ర చేసి దేవుడికి క్షమాపణ కోరుకున్నా అని చెప్పారు. అంతేగాదు అన్యమతస్తులు ఉండొద్దని చెప్పింది నేనే మాట్లాడటం కొసమెరుపు.




