Monday, May 13, 2024
- Advertisement -

నేనున్నా.. అంటున్న వైసీపీ

- Advertisement -

తెలంగాణలో రాజకీయంగా పుంజుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. వరంగల్ ఎంపీ సీట్ కు ఉప ఎన్నిక రావడంతో.. ఇదే చాన్స్ గా బరిలో నిలిచేందుకు ఆరాటపడుతోంది. బై పోల్ లో.. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎన్డీయే (టీడీపీ బీజేపీ) మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నా…

అందరికీ గట్టి పోటీ ఇచ్చి ప్రజల్లో పట్టు పెంచుకోవాలని జగన్ పార్టీ కసరత్తు చేస్తోంది. తోటి రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలా ప్రజలు తీర్పు ఇవ్వడం ఖాయమని.. పార్టీ రాష్ట్ర చీఫ్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ను ప్రధానంగా నమ్ముకుంటున్న పార్టీ.. ఎన్నికల బరిలోకి దూకేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ నుంచి బరిలో దిగేది ఎవరన్నదీ ప్రస్తుతానికి స్పష్టం కాకపోయినా.. బంతి జగన్ కోర్టులో ఉన్నట్టు తెలుస్తోంది. బై పోల్ కు నోటిఫికేషన్ కూడా వచ్చేయడంతో.. ఇవాళో రేపో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో జగన్ సోదరి షర్మిల పర్యటనతో జనంలో వెళ్లిన పార్టీ శ్రేణులను..  ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికతో మళ్లీ ప్రజాక్షేత్రంలో తిప్పేందుకు వైసీపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే వామపక్షాల అభ్యర్థి ఖరారవడం.. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ కావడానికి రంగం సిద్ధమవడం.. టీడీపీ బీజేపీ కామన్ అభ్యర్థిపై 2 పార్టీలు తీవ్రంగా ఫోకస్ చేస్తుండడంతో.. వైసీపీ కూడా రంగంలో దూకేందుకు సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లోకి వెళ్తే… తర్వాత వచ్చే ఎన్నికలనాటికైనా జనంలో గుర్తింపు సొంతం చేసుకోవచ్చన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -