ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పిలుపు మేరకు మండల కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి.రుణమాఫీతో షహా వివిధ హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఈ ధర్నాలు జరుగుతున్నాయి.వివిధ ప్రాంతాలలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,ఎమ్.పిలు,ఇతర నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు ఆరంబమయ్యాయి. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలో ధర్నా జరిగింది.
జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.పులివెందుల వద్ద ఎమ్.పి అవినాశ్ రెడ్డి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి, రాయచోటిలో శ్రీకాంతరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే శ్రీనివాసులు నాయకత్వంలో ధర్నాలు జరిగాయి.రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆద్వర్యంలో ధర్నా జరిగింది. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి,ఆదోనిలో ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి నాయకత్వం వహించారు.తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది
