Sunday, May 12, 2024
- Advertisement -

హమ్మయ్య….. వైకాపా గెలుపు ఖాయం చేసిన లోకేష్

- Advertisement -

2019 ఎన్నికల్లో గెలవబోయేది జగనే. అయితే అందుకు కారణం మాత్రం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర కాదు. వైకాపాను గెలిపించేది కూడా జగన్ కాదు. బాబు ప్రభుత్వ వ్యతిరేకత కూడా కాదు. నారా లోకేష్‌నే. 2019లో వైకాపాను గెలిపిస్తానని, జగన్‌ని సిఎం చేస్తానని స్వయంగా లోకేషే ప్రకటించాడు. అయితే మరీ అంత డైరెక్ట్‌గా చెప్పలేడు కదా. అందుకే ఇండైరెక్ట్‌గా చెప్పాడు. లోకేష్ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించిన టిడిపి శ్రేణులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి. వాళ్ళ ఆవేదనను పంచుకోవడానికి సమయానికి చంద్రబాబు కూడా అమరావతిలో లేడు. పెదబాబుగారు ప్రస్తుతం విదేశీ టూర్‌లో బిజీ. ఈ గ్యాప్‌లోనే వైకాపా గెలుపుకు దోహదపడే చాలా నిర్ణయాలు తీసుకున్నాడు లోకేష్. అలాగే జగన్‌ని గెలిపించే మాటలు కూడా మాట్లాడేశాడు.

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను అన్న లోకేష్ భారీ స్టేట్‌మెంట్ ఇప్పుడు టిడిపి నాయకులను, శ్రేణులను భయపెడ్తోంది. చంద్రబాబు విదేశీ టూర్‌లోనే ఒక్క రోజు కర్నూలులో పర్యటించిన లోకేష్ అప్పుడే అనవసరంగా అభ్యర్థులను ప్రకటించి టిజి వెంకటేష్‌తో సహా చాలా మంది నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసేలా చేశాడు. టిడిపిలో లోకేష్‌ నిర్ణయానికి అంత సీన్ లేదని టిజి వెంకటేష్ డైరెక్ట్‌గానే మీడియా ముందు అనేశాడు. ఇక ప్రజలను కూడా బెదిరించినట్టుగా మాట్లాడి ప్రజా వ్యతిరేకత కూడా మూటకట్టుకున్నాడు.

అలాంటి నారా లోకేష్ బాబు ఇక రాష్ట్రమంతా పర్యటిస్తే టిడిపి నాయకుల మధ్య తీవ్రస్థాయి విభేదాలు రావడం, ప్రజల్లో టిడిపిపై వ్యతిరేకత రావడం పెద్ద విషయమా? అప్పుడెప్పుడో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ప్రచారం చేసి టిడిపిని పూర్తిగా పాతాళంలోకి పాతేసిన లోకేష్ ఇప్పుడిక సీమాంధ్ర అంతా పర్యటిస్తే మాత్రం టిడిపి ఎన్నికలకు ముందే ఓడిపోవడం ఖాయం. కాకపోతే వైకాపా నాయకులు, శ్రేణులు మాత్రం 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేష్‌ని ప్రత్యేకంగా సన్మానించడాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి విశ్లేషణలే వినిపిస్తున్నాయి. చంద్రబాబో, టిడిపికి జాకీలేసే ఎల్లో మీడియా పెద్దలో టిడిపిపై పడబోతున్న ఈ లోకేష్ ప్రచార ఉపద్రవాన్ని అడ్డుకోకపోతారా అని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -