టిడిపికి ఊహించని షాక్ తగిలింది. అది ప్రతిపక్షం నుంచి అయితే ఓకే అందులో వింతేమిలేదు. అయితే తాజాగా మిత్రపక్షం భాజపా నుండే పచ్చపార్టీనాయకులకు మింగుడుపడటంలేదు. ఫిరాయింపు ఎంఎల్ఏలు, మంత్రులపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అధికార టీడీపీ మాత్రం ఎదురుదాడి చేయడం తెలిసిందే.
ఇప్పుడు మిత్ర పక్షం భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీనేతలతో కలసి భాజాపా ఫ్లోర్ లీడర్ ఫిరాయింపు మంత్రులు, ఎంఎల్ఏలపై తక్షణమే వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. మిత్రపక్షం నుండి ఇటువంటి డిమాండ్ వస్తుందని టిడిపి ఊహించలేదు. దాంతో విష్ణు డిమాండ్ పై ఏ విధంగా స్పందిచాలో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు. అసెంబ్లీ లోని వైసిపి కార్యాలయంలో విష్ణు పిఏసి ఛైర్మన్, వైసిపి ఎంఎల్ఏ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డితో కలిసి ఫిరాయింపులపై వేటుకు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటమే తప్పన్నారు. అంటే నేరుగా చంద్రబాబునాయుడునే భాజపా ఫ్లోర్ లీడర్ తప్పు పట్టినట్లైంది. ఏదో ఎంఎల్ఏలుగా ఫిరాయింపులను ప్రోత్సహించారంటే సరేలే అని సరిపెట్టుకున్నా వారిని ఏకంగా మంత్రులను చేయటమేంటని చంద్రబాబును నిలదీశారు.
తాము మొదటి నుండి కూడా ఫిరాయింపులకు వ్యతిరేకమనే చెప్పారు. ప్రతిపక్ష ఎంఎల్ఏలను మంత్రులను చేయటం దారణంగా చెప్పారు. తక్షణమే వారిచేత రాజీనామాలు చేయించాలని లేకపోతే వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే ఏ పార్టీ తరపున ఎంఎల్ఏగా గెలిచినా మంత్రిని చేయవచ్చనే కొత్త చట్టం చాయాలంటూ చంద్రబాబును ఎద్దేవాచేశారు.
