- Advertisement -

చంద్రబాబు జైలుకు.. మళ్లీ తెరపైకి….?

- Advertisement -

ఢిల్లీలో మరోసారి గద్దెనెక్కకుండా ఎన్నికల ముందర చంద్రబాబు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు.. మోడీని గద్దెదించడానికి దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలైన మమతా బెనర్జీ, కుమారస్వామి, కాంగ్రెస్ లతో చంద్రబాబు ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావు.. అయితే నవ్విన నాప చేనేపండినట్టుగా కేంద్రంలో బీజేపీ మరోసారి అఖండ మెజార్టీతో గెలువగా.. చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓడిపోయారు.

అయితే చంద్రబాబు చేసిన కుట్రలకు బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి వెళ్లినా చంద్రబాబు బాధపడలేదు. బీజేపీతో చంద్రబాబు కాళ్లబేరం నడిపారన్న అనుమానాలు వచ్చాయి.

అయితే బీజేపీ వదిలినా రాష్ట్రంలోని వైసీపీ మాత్రం టీడీపీ అక్రమాలను బయటకు తీద్దామని భావిస్తుంటే కేంద్రం మోకాలడ్డడం వీరిద్దరి ఫ్రెండ్ షిప్ తార్కాణంలా ఉంది. పోలవరం, విద్యుత్ కొనుగోళ్లపై రివ్యూచేసి రద్దు చేసిన జగన్ వాటిపై విచారణ చేయిస్తానంటూ కేంద్రం అడ్డుతగులుతోంది. ఇదే కనుక జరిగితే చంద్రబాబు చిక్కుల్లో పడడం ఖాయం. కానీ కేంద్రంలోని బీజేపీ జరగకుండా అడ్డుకుంటోంది.

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని.. అలాంటి వ్యక్తిని జైలుకు పంపాలని వ్యాఖ్యానించారు. మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మాటలను కేంద్రం మాటగానే భావించాలా.? చంద్రబాబును జైలుకు పంపే సమయం ఆసన్నమైందా లేదా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -