- Advertisement -

అన్నింటిని వాడేస్తున్న 40 ఇయ‌ర్స్ ఇండస్ట్రీ…ఇది జ‌గ‌న్ నైతిక విజ‌య‌మేనా…?

- Advertisement -

40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే బాబు ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ హ‌యాంలో కూడా ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొని ఉండ‌రు. జ‌గ‌న్ దెబ్బ‌కు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే స‌త్తా లేక దొంగ‌దారులు వెతుక్కుంటున్నారు. వాడుకొని వ‌ద‌లేయ‌డంలో బాబుకు పార్టీనాయ‌కులైనా, బంధువులైనా అంద‌రూ ఒక్క‌టే. అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను త‌న స్వార్థ రాజ‌కీయం కోసం ఉప‌యోగించుకోవ‌డంలో బాబు ఆరి తేరారు. పోల్ మేనేజ్ మెంట్ చేయ‌డంలో దేశంలో బాబు త‌ర్వాతె ఎవ‌రైనా. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న అన్ని ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను వాడుకున్న బాబు ఇప్పుడు రాజ్యాంగం స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్సించిన వ్వ‌వ‌స్థ‌ల‌పై పోరాటం మొద‌లు పెట్టారు. ఎన్నిక‌ల కోసం బాబు ఇప్ప‌టి బాబుకోని వ్య‌వ‌స్థ అంటూ లేదు.

అస‌లు విష‌యానికి వ‌స్తే….ఎన్నిక‌ల్లో గెలిచేందుకు బాబు అన్ని అడ్డ‌దారులు తొక్కుతున్నారు. వ్య‌వ‌స్థ‌ల‌న్నింటిని త‌న‌కు అన‌కూలంగా ఉప‌యోగించుకొని వైసీపీనీ దొంగ దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు..చేస్తున్నారు. ఏపీ సర్కారు దగ్గర ఉండాల్సిన ప్రజల డేటాను సేవామిత్ర వంటి యాప్ లకు అందించి త‌న స్వార్థం కోసం వాడుకున్నారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో వివాదాస్పదంగా వ్యవహరించి విమర్శల పాలైంది టీడీపీ.

జ‌గ‌న్ కేసుల స‌మ‌యంలో సీబీఐని త‌న బుజాన మోసిన‌ బాబు ఇప్పుడు అదే సీబీఐ చేదు అయ్యింది. రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశం లేదని జీవోలు విడుదల చేసింది బాబు ప్ర‌భుత్వం . అంతేనా.. రైడింగ్ కు వచ్చిన ఇన్‌కంటాక్స్ అధికారులపై దాడి చేసినంత దారుణంగా వ్యవహరించడం కూడా తెలుగుదేశం నైతిక పరాజయానికి చిహ్నమే కదా. త‌ప్పులు చేయ‌కుంటె భ‌య‌మెందుక‌నె ప్ర‌శ్న అద‌రిలోను ఉత్ప‌న్న‌మ‌వ‌డం స‌హ‌జ‌మే.

పోలీసులను అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు త‌న సామాజికి వ‌ర్గానికి చెందిన అధికారుల‌ను కీల‌క పోస్టుల్లో నియ‌మించుకొన్నారు. దీనిపై వైసీసీ చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరు పోలీసు అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది. చివరకు హిందూపూర్ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ను రిలీవ్ చేసే అంశంలోనూ చివరి వరకూ కుట్ర పూరితంగానే వ్యవహరించింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతడిని రిలీవ్ కాకుండా చేశారు. చివ‌ర‌కు ట్రిబ్యునల్, కోర్టులతో చీవాట్లు పెట్టింది.

ఇప్పుడు ఎల‌క్స‌న్ క‌మిష‌న్ పైనా గుస్సా అవుతున్నారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి ఐబీ చీఫ్‌ వెంకటేశ్వరరావుని బదిలీచేయడం తెల్సిన విషయాలే. ఇక్కడే చంద్రబాబుకి ఒళ్ళుమండిపోయింది. జాతీయస్థాయిలో ఎన్నికల కమిషన్‌పై పోరాటం చేస్తామంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్‌ ఆయా అంశాలపై స్పందించడం, విచారణ జరిపి చర్యలు తీసుకోవడం మామూలే. ఇదేమి కొత్త వ్య‌వ‌హారం కాదు.

సీబీఐని రావొద్దంటారు.. ఆదాయపు పన్ను శాఖపై గుస్సా అవుతారు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అంటే గిట్టదు.. చివరికి ఎన్నికల కమిషన్‌ మీద కూడా పోరాటమంటే బాబు నైతికంగా అప‌జ‌యాన్ని ఒప్పుకొన్న‌ట్టే కదా..! దేశంలో బాబు పోరాటం చేయ‌ని వ్వ‌వ‌స్థ‌లు ఏదైనా ఉందంటె అది న్యాయ‌వ్వ‌స్థ ఒక్క‌టే. భ‌విష్య‌త్తులో కూడా సుప్రీంకోర్టుమీద పోరాటం చేస్తానంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -