Monday, May 13, 2024
- Advertisement -

చంద్రబాబు ఆరోగ్య స్థితిగతులపై అనుమానాలా?

- Advertisement -

చంద్రబాబు ఆరోగ్య స్థితిగతులపై టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్న సందేహాలకు అసలు కారణం ఏంటి? 70 ఏళ్ళ వయసుకు చేరువవుతున్న చంద్రబాబు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నాడా? గతంలో రెండు మూడు పర్యాయాలు బహిరంగ వేదికలపైనే అలసిపోయి కూర్చున్నాడు చంద్రబాబు. ఆ వెంటనే డాక్టర్స్ చెకప్‌లు, ఎనర్జీ డ్రింక్స్ తర్వాత మళ్ళీ మామూలు అయ్యాడు. చంద్రబాబు శారీరక ఫిట్నెస్‌పై ప్రజలకు కనిపించిన నిజాలు ఇవి.

ఇక మానసిక ఆరోగ్యంపై టిడిపి నేతల్లోనే ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు జ్ఙాపకశక్తి పూర్తిగా తగ్గిపోతోందని టిడిపిని వీడిన మోత్కుపల్లి లాంటి నేతలు సాక్ష్యాలతో సహా చెప్తున్నారు. ఇక ఈ మధ్య చంద్రబాబు ప్రసంగాల్లో పదే పదే తప్పులు దొర్లుతున్నాయి. రాజకీయాల్లో ఇంకా ఓనమాలు కూడా తెలియని లోకేష్ మాటల్లో తప్పులు, జోకుల విషయం పక్కన పెడితే దేశంలోనే అత్యంత అనుభవజ్ఙుడైన నేతగా చెప్పుకునే చంద్రబాబు మాటల్లో తప్పులు ఎందుకు దొర్లుతున్నాయి? మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినడిగినా పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడని చెప్తారు. కానీ చంద్రబాబు మాత్రం పొట్టి శ్రీరాములు దీక్ష విరమించడాని మాట్లాడేశారు.

చిన్న చిన్న విషయాలు పక్కన పెడితే ఇలాంటి చారిత్రక విషయం చంద్రబాబుకు తెలియదంటే నమ్మడం కష్టం. ఇక టిడిపి నాయకులతో మాట్లాడిన మాటలు, నాయకులను, కార్యకర్తలను గుర్తుపట్టడం విషయంలో కూడా చంద్రబాబు తడబడుతూ ఉన్నారని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతానికి అయితే చంద్రబాబు ఆరోగ్య స్థితిగతలపై, మానసిక స్థితిపై అటు ప్రజలతో పాటు స్వయంగా టిడిపి నేతల్లో, ఇతర పార్టీల నేతల్లో వ్యక్తమవుతున్న సందేహాలు హైలైట్ అవ్వకుండా పచ్చ మీడియా మేక్సిమం మేనేజ్ చేస్తోంది. అయితే చంద్రబాబు పదే పదే తప్పులు మాట్లాడుతూ ఉండడం, విషయాలు మర్చిపోతూ ఉండడాన్ని మాత్రం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టిడిపి నుంచి ఎలాంటి వివరణలు వస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -