Sunday, May 12, 2024
- Advertisement -

సొంత మంత్రులు, ఎమ్మెల్యేల‌పై మూడో క‌న్ను

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శైలే వేరు. ఎంత ప్ర‌జా వ్య‌తిరేక‌త‌, వ‌ర్గ పోరులు ఉన్నా దాన్ని త‌ట్టుకొని నిల‌వ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ఎదురొడ్డి నిల‌వ‌డం ఆయ‌న స్టైల్‌. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కుల‌ను ఎలా నియంత్రించుకోవాలో.. ఏ విధంగా త‌న దారిలోకి తెచ్చుకోవాలో చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌.

ఎమ్మెల్యేల మీద, మంత్రుల, తన సొంత పార్టీకి చెందిన వారే అయిన సీనియర్ నాయకుల మీద సర్వే పేరుతో నిత్యం నిఘా పెట్టడం, ఏడాదికోమారు సర్వే ఫలితాలు అంటూ విడుద‌ల చేయ‌డం తెలిసిందే. ఇటీవ‌ల సొంత ఎమ్మెల్యేల‌పై స‌ర్వే చేసి షాక్‌కు గుర‌య్యారు. దీని నుంచి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఏ విధంగా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏవిధంగానైనా మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ క్ర‌మంలో స‌ర్వే త‌ర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కులపై డేగ క‌ళ్లు వేయ‌నున్నారు. మీరు చేసే ప‌నిని మూడో క‌న్ను కనిపెడుతుంద‌ని, ఎలాంటి ప‌నులు చేసిన వెంట‌నే త‌న‌కు తెలుస్తుంద‌ని మంత్రులు, ఎమ్మెల్యేల‌ను హెచ్చ‌రిస్తున్నారు. ఆ విధంగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ త‌న చెప్పుచేత‌ల్లో నాయ‌కులు ఉండేలా చేస్తున్నారు. అందుకే త‌న‌క‌న్నా సీనియ‌ర్ నాయ‌కులైనా ఎద‌గ‌నీయ‌కుండా త‌న మాట వినేట్టు చేస్తున్నారు.

ఇప్పుడు ఆయన తన మార్కు బెదిరింపులకు మరో ‘వేల్యూ ఎడిషన్’ కూడా చేస్తున్నారు. తన పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ప్రధానంగా మంత్రుల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లుగా రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మంత్రుల పనితీరు ఎలా ఉంది.. ప్రధానంగా నియోజకవర్గాల్లో వారు ఎలా వ్యవహరిస్తున్నారు. తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా? అక్కడి ప్రజల, పార్టీ కార్యకర్తల వినతుల పట్ల స్పందించడంలో సజావుగా వ్యవహరిస్తున్నారా లేదా? అవినీతి ఆరోపణల విషయం ఏమిటి? ఇలాంటి విషయాలు అన్నిటినీ ప్రెవేటు సంస్థలను నియోగించడం ద్వారా చంద్రబాబునాయుడు నిఘాపెట్టి వివరాలు సేకరిస్తున్నట్లు చంద్ర‌బాబు.

చంద్రబాబునాయుడు కేబినెట్‌లో మంత్రులు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నట్లు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండాపోతున్నారని ఆయన దృష్టికి ఇటీవల విపరీతంగా ఫిర్యాదులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అవినీతి ఆరోపణల వల్ల.. పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని భయపడుతున్న చంద్రబాబు.. మంత్రుల్నిఅదుపులో, చెప్పుచేతల్లో పెట్టుకోవడం కోసం.. వారి అవినీతిని ఆరోపణల బాగోతాలపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో పెద్దలుగా ఎడాపెడా దండుకోవడం గురించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు.. అవి నిజమని తేలితే.. వారి మీద వేటే వేస్తారో లేదా వాటాలు పంచేస్తారో.. వేచిచూడాలని జనం అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -