Friday, May 17, 2024
- Advertisement -

ప్రజలను బిచ్చగాళ్లను చేసే సంక్షేమ పథకాలకు కోట్లు ఖర్చు …ప‌ల్లెల్లోఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించ‌లేరా…?

- Advertisement -

టెక్నాల‌జీకి కేరాఫ్‌గా త‌న‌ను తాను చెప్పుకొనే చంద్ర‌బాబు సాంకేతిక ప‌రిజ్ణానాన్ని ఉప‌యేగించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రిస్తున్నామ‌ని ఎక్క‌డ చూసినా సొంత‌డ‌బ్బాకొట్టుకోవ‌డ మామూలె. త‌న కార్య‌ల‌యంలో డాష్‌ బోర్డు అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకొని కుగ్రామాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పుకొనే బాబు పాత‌విధానాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు. గ‌తంలో ప‌ల్లెల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకొని వాటిని ప‌రిస్క‌రించేందుకు ప‌ల్లెనిద్ర కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు ప్రారంభించారు.

ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లి అక్కడి సమస్యలు తెలుసుకొని ఏదైనా ఓ గ్రామంలో రాత్రిపూట నిద్రించాలి. ఇలా నెలకు రెండు నిద్రలు చేయాలి. కలెక్టర్లు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు, సీనియర్‌ అధికారులు, శాఖల అధిపతులు. కాని ‘పల్లె నిద్ర’ను అధికారులు ఖాతరు చేయలేదు. ఇప్పటివరకు ఒక్క కృష్ణా జిల్లా కలెక్టరు మినహా మరే జిల్లాలోనూ ఈ పని చేయలేదు. బాబు ఆదేశాలు బుట్ట‌దాఖ‌లేన‌న్నమాట‌.

చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమాల్లో పల్లె నిద్ర ఒకటి. మరి అధికారులు దీన్ని పనికిమాలిన కార్యక్రమం అనుకున్నారో ఏమొ గాని దాన్ని అస్స‌లు ప‌ట్టించుకోలేదు. పల్లె నిద్ర అనేది తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటోందని, పరిష్కారం చేస్తుందని ప్రజలు నమ్మేందుకు పెట్టిన కార్యక్రమం.

టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేని రోజుల్లో ఇలాంటి కార్యక్రమం అమలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అత్యంత అధునాత‌న సాంకేతిక టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. అందులోను హైటెక్ ముఖ్య‌మంత్రిగా బాబుకు మంచి పేరుంది. ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. అక్కడ తగిన సౌకర్యాలు లేవు. వాటిని అధికారులు,ప్ర‌జాసంఘాలు, పార్టీలు ఉన్నాయి. గ్రామాల స‌మ‌స్య‌ల‌ను తెలియ‌చెప్పేందుకు ప‌త్రిక‌లు ఉన్నాయి.

సచివాలయంలో ఆధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంత ఉన్నప్పుడు సమాచారం అందడం కష్టం కాదు. పల్లెలకు పోయి పడుకుంటేగాని సమస్యలు పరిష్కారమవుతాయా? పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి, అధికారులకు ఉండాలి. ఉత్సవాలకు, పండుగలకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు, ప్రజలను బిచ్చగాళ్లను చేసే సంక్షేమ పథకాలకు కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడం అసాధ్యం కాదు. మ‌రి ఆదిశ‌గా ప్ర‌భుత్వ పల్లేల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -