కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు భారత్ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 10 కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునివ్వగా ఇందులో కాంగ్రెస్ అనుబంధ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), సీపీఐ అనుబంధ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC),హింద్ మజ్దూర్ సభ (HMS), సీపీఎం అనుబంధ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (CITU),ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (AIUTUC),ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ (TUCC),సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ (SEWA),ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (AICCTU),లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF),యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC) ఉన్నాయి.
ఇక బంద్ ప్రభావం బ్యాంకింగ్ సెక్టార్‌పై పడే అవకాశం ఉంది. బ్రాంచ్ సేవలు, చెక్ క్లియరింగ్, కస్టమర్ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ మరియు కోఆపరేటివ్ బ్యాంకుల ఉద్యోగులు బంద్‌లో పాల్గొనవచ్చు. అధికారికంగా బ్యాంకులకు సెలవు ప్రకటించలేకపోయినా, కార్యకలాపాలు అంతరాయం కలగవచ్చు
అలాగే తపాలా సేవలు..లెటర్స్ , పార్సెల్స్ ఆలస్యంగా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. బొగ్గు ఉత్పత్తి మరియు కర్మాగారాల్లో ఉత్పత్తిని నిలిపివేయవచ్చు. బస్సులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు అంతరాయం కలగవచ్చు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తవచ్చు. చాలా ప్రభుత్వ శాఖల సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
యూనియన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేసే అవకాశముంది.భారత్ బంద్‌లో దేశవ్యాప్తంగా ఉద్యోగులు, రైతులు పెద్దఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.
