- Advertisement -

నాతో ప్లాస్‌బ్యాక్‌లు తవ్వించుకోవద్దు… బొత్స వార్నింగ్

- Advertisement -

చంద్రబాబు అండ్ టీంకు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలను అంటగట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో స్పందించిన బొత్స సత్యనారాయణ… చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

పులి అంటే భయం ఉన్న వాళ్లంతా వచ్చి తన చుట్టూ పడుకోండి అన్నట్టుగా చంద్రబాబు తీరుందన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్‌.. బీజేపీ నేతలను కలిశారని నమ్మించేందుకు చివరకు డ్రైవర్ లాగ్‌బుక్‌ను కూడా ట్యాంపరింగ్ చేసే స్థాయికి టీడీపీ దిగజారిందన్నారు. లాగ్‌బుక్‌ను చూస్తే ట్యాంపరింగ్ చేసిన విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు.

తమ దృష్టిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ మూడు ఒకటేనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలతో కలిసే ప్రసక్తే లేదన్నారు. ఆ మూడు పార్టీల వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోయిందన్నారు. వైసీపీకి, బీజేపీకి మధ్య సంబంధాలున్నాయని ప్రచారం చేస్తున్న చంద్రబాబు… కేంద్రమంత్రి నిర్మాలసీతారామన్ భర్త పరకాల ప్రభాకర్‌ను సీఎంవోలో ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణికి టీటీడీ సభ్యత్వం ఎలా ఇచ్చారన్నారన్నారు. బీజేపీ పెద్దలతో సంబంధాలు కొనసాగించేందుకే వారికి పదవులు ఇచ్చారని బొత్స వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చేస్తున్న అవినీతిపై మరో పుస్తకాన్ని ముద్రిస్తున్నామని.. దాన్ని దేశంలోని అన్ని పార్టీలకు అందజేస్తామన్నారు. చంద్రబాబు అవినీతి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తాను పీసీసీ చీఫ్‌గా చేసినప్పుడు చంద్రబాబు ముసుగేసుకుని వచ్చి చాలా మందిని రహస్యంగా కలిశారని బొత్స చెప్పారు. టీడీపీ తీరు మారకుంటే సమయం వచ్చినప్పుడు అవన్ని బయటపెడుతానని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుపై కేసు పెడితే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తామని టీడీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. అగ్నిగుండం చేయలేరు.. గాడిద గుడ్డు చేయలేరని వ్యాఖ్యానించారు. ప్రివిలేజ్‌ మోషన్ పెడుతామంటే బెదిరిపోయే వ్యక్తి బుగ్గన రాజేంద్రనాథ్‌ కాదని బొత్స స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -