- Advertisement -

మాతో పాటు జగన్ నూ ముంచేస్తాం : కేంద్రమంత్రి

- Advertisement -

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురాతనందట. అలానే ఉంది బీజీపీ తీరు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చేస్తాం. అవినీతి రూపు మాపేస్తాం. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేస్తాం. నోట్ల రద్దుతో ఇక అద్భుతాలే. అని చెప్పుకొచ్చి సామాన్యుడి నడ్డి విరిచింది నరేంద్రమోడీ సర్కార్. ఏ ఒక్క హామీ నెరవేర్చక తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. దేశమంతా ఎలా ఉన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. ఆరుకోట్ల ఆంధ్రులను వెర్రివాళ్లను చేస్తూ మోడీ హోదాపై మోసం చేశాడు. హోదా వచ్చి ఉంటే ఈ నాలుగేళ్లలో ఎన్నో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏపీకి వచ్చి ఉండేవి. కానీ మోడి చేసిన మోసం ఏపీకి శాపంగా మారింది. గత నాలుగేళ్లలో జరగాల్సిన అభివృధ్ది ఆంధ్రాలో ఆగిపోయింది.

ఈ పాపం ముమ్మాటికీ నరేంద్రమోడీదే. ఆయన చేసిన మోసానికి ఈ సారి ఏపీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. 2019లో ఏపీలో బీజేపీ ఒక్కటంటే ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకోవడం కష్టం. బీజేపీయే కాదు ఆ పార్టీతో జట్టు కట్టే పార్టీలకూ తగిన శాస్తి తప్పదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన దేశముదురు చంద్రబాబు నాయుడు వెంటనే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. తమ పార్టీ అభ్యర్ధులతో కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయించేశారు. ఇప్పుడు తెల్లారి లేచింది మొదలు మోడీని, బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. బీజేపీని తిడుతూ కొంతలోకొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉంటే మరోవైపు ప్రత్యేకహోదా ఇవ్వని మోడీని పల్లెత్తు మాట అనకుండా, బీజేపీకి వంత పాడుతూ, ఆ పార్టీతో స్నేహానికి జగన్ తహతహలాడుతున్నాడని అధికార పార్టీతో పాటు సామాన్యులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో చేరాలని ఆశ పడుతున్నారని విమర్శలూ వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ నష్టపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విచ్చేసిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశశారు. చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి వైదొలగారని, హోదా విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తారని చెప్పుకొచ్చారు. ఈ నాలుగేళ్లు ఏపీ నష్టపోయినా పట్టించుకోని మోడీ, ఇంకొన్నాళ్లు ప్రాథేయపడితే హోదా ఇచ్చేవారని చెప్పుకోవడం సిగ్గుచేటు. జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నామనీ అథవాలే చెప్పారు. అలా అయితే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము సహకరిస్తామన్నారు.

ఈ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే… చంద్రబాబు ఎడమకాలితో తన్నేసిన కేంద్ర మంత్రి పదవుల కోసం ఎన్డీఏ కూటమిలో జగన్ భాగస్వామి కాకపోయినా, అందులో ప్రస్తుతానికి చేరకపోయినా, భవిష్యత్తులో ఏపీ బీజేపీ, వైఎస్ఆర్ సీపీ కలిసి పని చేయవచ్చనే సంకేతాలు ఆయనిచ్చారు. ఒకవేళ ఆయన ఆహ్వానం మేరకు జగన్ పార్టీ ఎన్టీఏలో చేరితే ఇక 2019లో ఏపీలో వైకాపా ఆశలు వదులుకోవాల్సిందే. బీజేపీ మీద ఉన్న కడుపుమంట అంతా వైకాపా మీద జనం తీర్చుకోవడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలుపు అనుమానమే. ఇక ఏపీలో ఆ పార్టీకి దిక్కేలేదు. అలాంటిది జగన్ ను సీఎం చేయడానికి సహకరిస్తామంటూ వాళ్లు ప్రకటనలు చేయడం జగన్ కొంప ముంచడమే. మాతో చేతులు కలిపితే జగన్ ను సీఎంను చేస్తామంటూ అథవాలే చేసిన వ్యాఖ్యలు, మాతో పాటు జగన్ నూ ముంచేస్తాం..అన్నటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -