Wednesday, May 8, 2024
- Advertisement -

తెలివిగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ముగిసింది. ఎవ‌రూ ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని….నాన్ లోక‌ల్ నాయ‌కులు ఎవ‌రూ ఉండ వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి దొంగ‌దారిని ఎంచుకోవ‌డం తెలిస్తే ముక్కు న‌వేలు వేసుకోవాల్సిందే.

అమ‌రావ‌తిలో సీఎం హోదాలో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేశారొ వాట‌న్నింటిని అరిగిపోయిన రికార్డులాగ మాట్లాడారు. ప‌లానా పార్టీకి ఓటు వేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌కుండా….ప‌రోక్షంగా జ‌గ‌న్‌కు బుద్దిచెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించ‌కుండా….జ‌గ‌న్ మాట‌ల‌ను మాత్ర‌మే ప్ర‌ధాన ఎజెండాగా పెట్టుకుని..జ‌గ‌న్ దుర్మార్గుడిగా,ప్ర‌జాకంట‌కుడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం టీడీపీ శ్రేణులు చేశాయి. తాజాగా మంగళవారం మళ్లీ చంద్రబాబునాయుడు అదే మాటలు పునరుద్ఘాటించారు. కాకపోతే.. ఈ ప్రసంగం నంద్యాల‌లో కాకుండా అమ‌రాతిలో జ‌రిగింది. ఓటు వేయమనే పాయింటు గురించి మాట్లాడితే అది ప్రచారం నిషేధాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.

అమరావతిలో ఎన్నికల ప్రస్తావన లేకుండా.. అదే ప్రచారాంశాలను, జగన్ మీద నిందలను, జగన్ దుర్మార్గాన్ని ఏకరవు పెడుతూ.. మీడియాలో ప్రచారం ద్వారా జగన్ వ్యతిరేకతను ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి ప్రయత్నిస్తే అది బహుశా ఉల్లంఘన కిందికి రాదని చంద్రబాబు తలపోసినట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -