గత కొన్ని రోజులగా జగన్‌ను ఆయన నియేజకవర్గంలో ఓడించి టీడీపీ జెండా ఎగరేస్తామని సవాలు విసిరారు టీడీపీ నాయకులు.ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో డబ్బుతో గెలిచిన అధికార పార్టీ మంత్రులు జబ్బలు చరిచారు.అందులోను వేంపల్లె సతీష్‌రెడ్డి గురించి చెప్పాలంటె బోలెడంత ఉంది.జగన్ మీద సవాల్లమీద సవాల్లు విసిరారు.
పులివేందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత సతీష్‌రెడ్డికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు.పార్టీ కోసం పనిచేసె వారిని పక్కన పెట్టడం అలవాటె.ఇప్పుడు కూడా అదేజరిగింది.జగన్‌ను ఎదుర్కొనె లోకల్ నాయకుడు సతీష్‌రెడ్డికి సీఎం ఝుల్ ఇచ్చారు.కాపా అధినేత నియోజకవర్గంలో తెలుగుదేశం ఉనికిని నిలపాలంటే ఆయనకు ఎమ్మెల్సీ పదవినినైనా ఇస్తారని అంతా అనుకున్నారు. అయితే సతీష్‌రెడ్డి ఆశలు అడియాసలయ్యాయి.
గవర్నర్ కోటాలో భర్తీ అయ్యే రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి తనకు దక్కుతుందని సతీష్‌రెడ్డి చాన్నాళ్లుగానే ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సతీష్‌రెడ్డి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. గడ్డం పెంచడం అయితేనేం.. దాన్ని తీయించుకోవడం అయితేనేం.. తన ప్రయత్నాలు తాను చేశాడు. సైకిల్ యాత్ర నిర్వహించాడు.. పాపం ఆ సైకిళ్లను వచ్చిన వాళ్లు తలా ఒకటి తొక్కుకుపోయారట. మరి ఇన్ని రకాలుగా పాట్లు పడుతుంటే.. సతీష్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు.
ఏదొక పదవి ఉంటె గాని నియేజక వర్గంలో కొంత కేడర్‌ను నిలుపుకోవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నవేళ పదవి ఉండుంటే.. సతీష్‌రెడ్డి కొంతవరకూ జనాల్లోకి చొచ్చుకుపోగలడు. మరి పులివెందుల్లో గెలుస్తాం.. అని గంటా శ్రీనివాసరావు దగ్గర నుంచి అచ్చెంనాయుడు వరకూ నాన్‌లోకల్ లీడర్లు డప్పేస్తూ ఉంటారు. ఇప్పటికి తెలిసిందా జగన్‌ను ఏంచేయలేమని.సతీష్‌రెడ్డికూడా చేతులెత్తేశాడన్నమాట.
