- Advertisement -

ఎన్టీఆర్‌ వెన్నుపోటు సూత్రం…. ఎపి ప్రజల విషయంలో కూడా వర్కవుట్ అవుతుందా?

- Advertisement -

2019లో అన్ని సీట్లలోనూ మేమే గెలుస్తాం. ఒకటి రెండు సీట్లలో ప్రజలు తనను ఓడిస్తే……ఎందుకు ఓడించామా అని చెప్పి ఆ ప్రజలే సిగ్గుపడాలి అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అవుతున్నాయి. ఆ మధ్య నంద్యాల ఎన్నికల సందర్భంగా కూడా ….నేను వేసిన రోడ్లపై తిరుగుతూ…..నేను పెట్టిన తిండి తింటూ అనే స్థాయిలో ప్రజలు బానిసలు అన్న అర్థం వచ్చేలా బాబు మాట్లాడిన మాటలను నేషనల్ మీడియా ఏకిపడేసింది. అయినప్పటికీ బాబు మాత్రం ఏమీ మారలేదు. మరోసారి ప్రజలను చులకన చేసి మాట్లాడేశాడు.

1994లో తన కష్టార్జితంతో టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఆ అధికారంపై ఆశ పెంచుకున్న చంద్రబాబు తనకు కూతురినిచ్చిన మామ, రాజకీయంగా ఉన్నత పదవులు ఇచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి పదవిని కూడా లాక్కున్నాడు. ఎన్టీఆర్‌పైన చెప్పులు వేయించాడు. ఎన్టీఆర్‌కి విలువలు లేవు అన్నాడు. ఆ తర్వాత ఆ దిగులుతోనే ఎన్టీఆర్ చనిపోయాడన్నది నిజం. కట్ చేస్తే ఆ ఎన్టీఆర్ పేరు చెప్పుకునే 1999 ఎన్నికల్లో గెలిచాడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడవడం, ఆయన పార్టీని లాక్కుని, ఆయన్ని క్షోభకు గురిచేయడం లాంటి అన్ని దుర్మార్గాలకు కూడా ……అది అప్పటి చారిత్రక అవసరం…..అన్న కలర్ ఇచ్చాడు చంద్రబాబు. ఆంద్రప్రదేశ్ ప్రజల కోసమే ఆ మహా యజ్ఙాన్ని చంద్రబాబు చేశాడన్న స్థాయిలో ప్రచారం చేయించుకుని…..ఎన్టీఆర్‌కి కూడా మేలే చేశామన్నట్టుగా ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కూడా చంద్రబాబు పొందాడు. చంద్రబాబు రాజకీయవ్యూహాలు, కుట్రలు అప్పటి రాజకీయ మేధావులను కూడా ఆశ్ఛర్యపరిచాయి.

2019లో కూడా చంద్రబాబు ఇదే స్ట్రాటజీని ఫాలో అవబొతున్నాడు. 2014ఎన్నికల్లో మోడీ-బాబు జోడీ అభివృద్ధి జోడీ, మమ్మల్ని గెలిపిస్తే కేంద్రం నుంచి రావాల్సిన హోదా ఐదేళ్ళు కాదు, పదిహేనేళ్ళు తెస్తాం, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణం ………అన్నీ పూర్తి చేస్తాం అన్నారు. ఇక తాను ఇచ్చిన రుణమాఫీ హామీలు, నిరుద్యోగ భృతి లాంటివన్నీ నెరవేరుస్తాం అన్నారు. గడిచిన మూడున్నరేళ్ళలో సంపూర్తిగా బాబు నెరవేర్చిన ఒక్క హామీ కూడా లేదు. తన వ్యక్తిగత స్వార్థం కోసం హోదాను కూడా బలిపెట్టాడు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలకు రెడీ అవుతున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి, ఆయన ఆత్మక్షోభకు కారణమైన చంద్రబాబు…..అదే ఎన్టీఆర్ బొమ్మతో 1999ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించినట్టుగానే 2019ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనుకుంటున్నాడు. తాను ఇచ్చిన రుణమాఫీ హామీలతో సహా, హోదా లాంటి హామీల అన్నింటి విషయంలోనూ మోడీని బూచిగా చూపించే ప్రయత్నం ఆల్రెడీ మొదలు పెట్టాడు. తనను అన్ని విధాలుగానూ నరేంద్రమోడీ ఇబ్బందులు పెడుతున్నప్పటికీ తాను మాత్రం అహర్నిశలూ కష్టపడుతూ రాష్ట్రానికి చాలా చేశానని చెప్పుకోనున్నాడు. 2019 తర్వాత మోడీ వచ్చే ఛాన్సే లేదని, వచ్చినా పూర్తి మెజారిటీ రాదని …..అలాంటి పరిస్థితి వస్తే తాను మరోసారి చక్రం తిప్పి అన్నీ చేసేస్తానని చెప్పబోతున్నాడు. ఈ ఫార్ములా 2019లో బాబుకు వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ ప్రజలు కాస్త ఆలోచించారంటే మాత్రం చంద్రబాబు పని అవుట్.

2014లో మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దింది ఎవరు? రాష్ట్ర విభజనలో కాంగ్రస్‌తో సమాన పాపం పంచుకున్న బిజెపికి ఆంద్రప్రదేశ్‌లో ఓట్లు పడేలా చేసింది ఎవరు? మోడీతో కలిసి రాష్ట్రానికి 15 సంవత్సరాలు హోదా తెస్తామని చెప్పింది ఎవరు? ఓటుకు కోట్లు కేసు పుణ్యమాని వ్యక్తిగత స్వార్థంతో మోడీ దగ్గర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? రుణమాఫీ చేయడం అసాధ్యం అని జగన్ చెప్పినప్పటికీ చేస్తా అని అబద్ధాలు చెప్పి, మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఎవరు?

2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీటిలో ఏ ఒక్క విషయం గురించి ఆలోచించినా చంద్రబాబు ఒక్కడే కాదు……పవన్ పుట్టి మునగడం కూడా ఖాయం. ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -