- Advertisement -

సిబిఐ భయం.. పెరుగుతున్న జగన్ బలం.. ముందస్తు వ్యూహంతో బాబు గెలుస్తాడా?

- Advertisement -

ముంచుకొస్తున్న సిబిఐ ముప్పు….. మరోవైపు ప్రజా సంకల్పయాత్రతో రోజు రోజుకూ బలం పెంచుకుంటున్న జగన్….చంద్రబాబుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో 2019 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశాడని టిడిపి నాయకులు చెప్తున్నారు. 2019 వేసవి కాలంలో ఎన్నికలకు వెళ్ళడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదని టిడిపి మంత్రులు చెప్తున్నారు. ప్రజాగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్ళాలని బాబు భావిస్తున్నాడు. మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని చెప్పి జనాల్లోకి వెళ్ళిన నేపథ్యంలో…..ప్రజా వ్యతిరేకత మొత్తం కేంద్ర ప్రభుత్వంపైకి మళ్ళిందని నమ్ముతున్న బాబు 2004లో లాగానే ఈ సారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని వ్యూహ రచన చేస్తున్నాడు.

కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబును టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజా సంకల్ప యాత్రతో రోజు రోజుకూ ప్రజాదరణ పెంచుకుంటున్నాడు జగన్. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికలే లక్ష్యంగా బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఒకవైపు సిబిఐ కేసుల భయం, ప్రజా సంకల్పయాత్ర పూర్తయ్యాక జగన్ బలం ఇంకా పెరుగుతుందన్న ఆందోళనలో ఉన్న చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నాడు. పాదయాత్రలో ఉన్న జగన్‌కి ఎన్నికలకు సన్నద్ధమవ్వడానికి టైం పడుతుంది. అలాగే ఎన్నికల సమయంలో బాబుపై సిబిఐ కేసుల్లాంటి వ్యవహారాలు ఏం నడిచినా బాబుకే ప్రజల్లో సానుభూతి వస్తుందన్న ఊహాగానాల్లో టిడిపి నాయకులు ఉన్నారు. అయితే కొంతమంది నాయకులు మాత్రం 2004లో ముందస్తుకు వెళ్ళి వైఎస్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన చరిత్రను గుర్తుచేస్తున్నారు. రాజధాని నిర్మాణం విషయంలో అతీగతీ లేదు, పోలవరానికి దిక్కులేదు, ఇక రుణమాఫీ హామీలు, నిరుద్యోగ భృతిలాంటి వాటి గురించి చెప్పనవసరం లేదు. అలాంటి నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఓట్ల కోసం ప్రజల దగ్గరకు వెళ్తే…….నాలుగేళ్ళలో ఏం చేశారని నిలదీస్తే ఏం చెప్పాలని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. అన్నింటికీ మించి ముందస్తుకు వెళితే ఓడిపోతామేమో అని భయపడ్డామని, సిబిఐ కేసులకు భయపడ్డామని ప్రజలు భావించే ప్రమాదం ఉందని కొంతమంది టిడిపి నేతలు భయపడుతున్నారు. 2019 వేసవిలో ఎన్నికలకు వెళ్తే టిడిపి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయన్న మాట నిజమే కానీ ముందస్తుకు వెళ్తే ఇంకా ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఉందని చంద్రబాబుకు విన్నవించుకుంటున్నారు టిడిపి నేతలు. ముందస్తుకు వెళ్ళి 2004లో వైఎస్ చేతిలో దెబ్బతిన్న చంద్రబాబులో ఆ భయం ఇంకా ఉంది. మరి ఇప్పుడు మరోసారి ఆ సాహసం చేయగలడా? కోరి కోరి తండ్రి వైఎస్ సాధించిన స్థాయి విజయాన్ని సాధించే అవకాశాన్ని జగన్‌కి ఇస్తాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -