Saturday, May 11, 2024
- Advertisement -

చంద్రబాబు తన వేలుతో తన కంట్లోనే పొడుచుకున్నాడా..?

- Advertisement -

ఒకరి అసమర్థత తెలియాలంటే ఒక సమర్దుడి పనితనం విలువ తెలిసి ఉండాలి.. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఈ విషయం చాల ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. చంద్రబాబు గత నలభై సంవత్సరాలు ఒకటి రెండు సార్లు మినహా రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నారు.. అభివృద్ధి అన్నది పక్కన ఉంచితే తన ఆస్తుల విలువ పెంచుకునేందుకు, తన అనుకున్న వారి ప్రయోజనాలు నిలుపుకునేందుకు మాత్రమే కృషి చేశారు తప్ప ఈనాడు రాష్ట్రాన్ని పాటించుకున్న పాపాన పోలేదు.. అయితే ఈ విషయం జగన్ పాలనలోకి వచ్చాక ప్రజలకు ఇన్నాళ్లు తామేం కోల్పోయాయమో అర్థమవుతుంది.

అనవసరముగా చంద్రబాబు ను నమ్మి తమ భవిష్యత్ ని తామే నాశనం చేసుకున్నారని వాపోతున్నారు.. ఇక తాజాగా నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధతపై దేశ వ్యాప్తంగా రాష్ట్ర పరిస్థితులపై అంచనాల ర్యాంకింగ్స్ ప్రకటించింది.. ఇందులో రాష్ట్రానికి 20 వ స్థానం వచ్చింది. వాస్తవానికి ఇది రాష్ట్రానికి చెడ్డ పేరే.. కానీ జగన్ మీద ఒక మచ్చ దొరికింది ఏకిపారేద్దాం అని చంద్రబాబు ముందు వెనకా ఆలోచించకుండా విమర్శించడం మొదలెట్టారు.. ఎగుమతుల సన్నద్ధతలో రాష్ట్రానికి 20వ ర్యాంక్ వచ్చింది అని… ఇది ప్రభుత్వ అసమర్ధత అనేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు..

అయితే నీతి అయోగ్ ర్యాంకింగ్స్ ఇచ్చింది ఎగుమతుల కాదు, వారి సన్నద్దత మీదే , అంటే గతంలో ఎగుమతులకు అనుకూలంగా రోడ్లు.. సి పోర్టుల వరకు రోడ్లు వేయడం, పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మౌలిక వసతులు కల్పించడం, కంపెనీలు ఎగుమతులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు పట్ల ఆయా కంపెనీల యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయడం దీనిలో ఉంటాయి.ఆ వీటిని పరిశీలనలోకి తీసుకుని ఆ తర్వాత ర్యాంకులు ఇస్తారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చి 15 నెలలే అయ్యింది. ఈ టైం లో చేసిన పనులు, మౌలిక వసతుల కల్పన మీద కాదు అన్నది చంద్రబాబు దాచి పెట్టి… ముందుగానే ప్రభుత్వం ను తిట్టి పోసి ఆయన సేఫ్ గేమ్ ఆడటానికి చేసే ప్రయత్నం మాత్రమే అని స్పష్టం అవుతుంది….ఏదేమైనా చంద్రబాబు తన ఈ వ్యవహారం తన మెడకే చుట్టుకునే విధంగా చేసుకున్నాడు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -