Sunday, May 5, 2024
- Advertisement -

ఫిరాయింపు మంత్రుల‌కు నంద్యాల ఉప ఎన్నిక‌ స‌వాల్‌…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో బాబు త‌న మంత్రివ‌ర్గ సైన్యాన్ని మోహ‌రించారు.ఎక్క‌డ చూసినా ప్ర‌భుత్వం మంత్రులే క‌నిపిస్తారు. ఇప్ప‌టికే అరడజనుకు పైగా మంత్రులు బృందాల వారీగా విడిపోయి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నంద్యాలలో గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.
వైసీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయింపుల‌ద్వారా మంత్రి ప‌ద‌వులు పొందిన వారికి ఈ ఉప ఎన్నిక స‌వాల్ లాంటిదే.మంత్రులంతా రాయ‌ల‌స‌మీమ‌కు చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నర్హం.నంద్యాల ఆటోనగర్‌లో పర్యటించిన మంత్రి ఆదినారాయణరెడ్డి…. నంద్యాల నియోజకవర్గం కోసం ఏమైనా చేస్తామని చెప్పారు. ఎప్పుడూ జరగని అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు.
ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, లోకేష్‌, అచ్చెన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, నారాయణలు విడతల వారీగా పర్యటిస్తున్నారు.ఈ ఎన్నిక బాబుతోపాటు భూమా అఖిల ప్రియ‌కు ప్ర‌తీష్టాత్మ‌కం కానున్నాయి.అఖిల కూడా వైసీపీనుంచి టీడీపీలోకి వెల్లి మంత్రిప‌ద‌విని చేప‌ట్టారు.పిరాయింపుల‌పై ఇప్ప‌టికే నియేజ‌క వ‌ర్గ‌ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు.
ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌ని మంత్రులంద‌రికి బాబు అల్టిమేట‌మ్ ఇచ్చారు.ముఖ్యంగా పిరాయింపు మంత్రుల‌కు ఈ ఎన్నిక ను చాలెంజ్‌గాతీసుకోవాల‌ని సూచించారు.ముగ్గురు మంత్రులు రాయ‌ల‌సీమ‌కు చెందిన వాల్లే కావ‌డంతో ఎలాగైనా గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.మ‌రి ఎంత‌మేర‌కు ప్ర‌భావం చూపుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -