- Advertisement -

ఆ ఇద్ద‌రు కాంగ్రెస్ నేత‌లు ఎక్క‌డా..?

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్ర‌స్ ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యింది. తెలంగాణాలో ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా ద‌క్కించుకున్నా ఏపీలో మాత్రం పూర్తి ప‌త‌నా వ‌స్థ‌కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నేత‌ల‌లో జోష్ నింపేందుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల‌పాటు తెలంగాణాలో ప‌ర్య‌టించారు. 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయ‌ని..విబేధాలు వీడి నాయ‌కులంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌ని నేత‌ల‌కు సూచించారు.

ఏపీలో మాత్రం ఇప్ప‌ట్లో పార్టీకి పూర్వ‌వైభ‌వం రావ‌డం క‌ష్ట‌మ‌ని చేతులెత్తేశారు. క‌నీసం 2019 ఎన్నిక‌ల్లో త‌మ ఉనికిని చాటుకొనేందుకు టీడీపీతో పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు పంపారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌ల‌మీద‌నే తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఆ ఇద్ద‌రు రాజ‌కీయ నేత‌లు ఎవ‌రో కాదు చిరంజీవి, విజ‌య‌శాంతి. ఇద్ద‌రూ సినిమా రంగంలో లెజెండ్‌లే. ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2008లో ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆతర్వాత కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసి కేంద్ర మంత్రి ప‌ద‌వి పొందారు. ఇక విజ‌య‌శాంతి కూడా టీఆర్ఎస్ త‌రుపునుంచి ఎంపీగా గెలిచి రాజ‌కీయాల్లో కొన‌సాగారు. ఆత‌ర్వాత టీఆర్ఎస్‌ను వ‌దిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇద్ద‌రూ నేత‌లు గ‌త కొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ రెండు రోజుల‌పాటు హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. అయితే ఈ ఇద్ద‌రూ నేత‌లు ఎక్క‌డా కూడా మ‌చ్చుకైనా క‌న‌ప‌డ‌లేదు. కాంగ్రెస్ ప్ర‌సిడెంట్ అంటే చెప్పాల్సిన ప‌నిలేదు. అలాంటిది రాహుల్ గాంధీ వ‌చ్చినా కూడా క‌నీసం ప‌ల‌క‌రించడానికి కూడా వారు వెల్ల‌లేదు. ఇదే ఇప్పుడు పార్టీలో తీవ్ర‌చ‌ర్చ‌నీయాశంగా మారింది.

కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్న విజ‌య‌శాంతి బోణాల స‌మ‌యంలో బంగారు బోనం ఎత్తి అవమ్మ‌వారికి స‌మ‌ర్పించారు. ఇక చిరంజీవి కూడా సైరా మూవీ సినిమాషూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా రాహుల్‌ను క‌ల‌వ‌డానికి స‌మ‌యం లేదా అన్న ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో విజ‌య‌శాంతి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు.

కొద్దిరోజుల క్రితం వ‌చ్చే సార్వ‌త్రికి ఎన్నిక‌ల్లో చిరంజీవి పార్టీ త‌రుపున ప్ర‌చారం చేస్తార‌ని ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్ర‌క‌టించారు. కాని ప‌రిస్తితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. వీల్లిద్ద‌రూ పార్టీలో ఉన్న‌ట్టా…? లేన‌ట్టా అన్న ప్ర‌శ్న‌లు తెల‌త్తుతున్నాయి.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్తితి వ‌చ్చే అవ‌కాశం దాదాపు శూన్యం అనే చెప్పాలి. ఏకంగా రాహుల్‌గాంధీనే చేతులెత్తేశారు. అలాంటి పిర‌స్థితుల్లో పార్టీలో ఉండ‌టం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌నే చిరంజీవి దూరంగా ఉన్నారు. ఇక తెలంగాణాలో కూడా అధికార పార్టీ కాద‌ని కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేంత సీట్లును గెలుచుకోలేద‌న్న‌ది తెలిసిందే.

ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని స్థాపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అన్ని స్థానాల్లోనూ, తెలంగాణాలో బ‌ల‌మున్న చోట్ల పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. చిరంజీ త‌మ్ముడు స్థాపించిన పార్టీలోకి వెల్లినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేదు. ఇక విజ‌య‌శాంతి విష‌యానికి వ‌స్తే భాజాపాలో గాని అధికార పార్టీలో టీఆర్ఎస్ మాత్ర‌మే అవ‌కాశం ఉంది. ఇద్ద‌రూ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేలేదు. వాల్లిద్ద‌రూ రాజ‌కీయీల‌కు దూరంగా ఉంటారా లేకా వేరే పార్టీలో చేరుతారా అన్న‌ది కొంత కాలం వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -