Friday, May 17, 2024
- Advertisement -

అయ్యా నారాలోకేష్ ఎన్టీఆర్ అంటే నీకు ఎందుకంత కోపం..?

- Advertisement -

ఎన్టీఆర్ మనవడు, నందమూరి అసలు వారసుడు గా చెప్పబడే జూ.ఎన్టీఆర్ గత కొంతకాలంగా రాజకీయాలకు దూరం గా ఉంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో చంద్రబాబుకి, టీడీపీ అండగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు పూర్తిగా పచ్చ చొక్కా ని తొడుక్కోవడమే మానేశాడు.. సినిమాల్లో నెంబర్ వన్ స్థాయి లో ఉన్న ఎన్టీఆర్ ఎందుకు రాజకీయంగా దూరంగా ఉన్నాడో తెలీదు కానీ టీడీపీ పై కాస్త అసహనం తో ఉన్నాడని మాత్రం తెలుసు.. ఇంకో కోణంలో ఆలోచిస్తే ఎన్టీఆర్ ని చంద్రబాబు ఎన్నికల సమయంలో అతని స్టార్ డమ్ ని వాడుకుని వదిలేసినట్లుగా తెలుస్తుంది.

మరీ ఎక్కువగా వాడితే ఎక్కడ తన కొడుకు లోకేష్ కి అడ్డొస్తాడేమోనని ఎన్టీఆర్ ని పక్కనపెట్టి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఇదే నిజం అని టీడీపీ నేతలు కూడా అంటారు. ఎన్టీఆర్ కి అసలే ఫాలోయింగ్ ఎక్కువ.. ఒకవేళ టీడీపీ లో ఉండనిస్తే మెల్లమెల్లగా పార్టీ లో పాతుకుపోయి టీడీపీ ఎక్కడ లాగేసుకుంటాడో అని నారా వారి భయం.. నందమూరి వారి నుంచి లాక్కుని ఇంతా చేస్తున్న మేము మళ్ళీ వారి చెస్థుల్లోకి పార్టీ వెళ్లడం ససేమీరా చంద్రబాబుకు ఇష్టం లేదు..

ఇక అప్పటినుంచే లోకేష్ కి, ఎన్టీఆర్ కి కూడా చెందిందని దూరం పెరిగిందని అంటున్నారు.. తాజాగా ఆ దూరం ఇంకా ఉందని స్పష్టం గా తెలుస్తుంది.. ఉన్నదానికి, లేనిదానికి పొలోమంటూ ట్వీట్ లు చేసే లోకేశుడు తన మేన మామ అయినా హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం వెనుక ఎన్టీఆర్ తో విభేదాలే కారణమంటున్నారు.. ఓ వైపు నారా వారి కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్ మాత్రం ఎనలేని ప్రేమను చూపిస్తుంటే నందమూరి వారి మేనల్లుడు, వారి పిల్లను చేసుకున్న అల్లుడు ఈవిధంగా గౌరవించకపోవడం చాల అనుమానాలకు తావిస్తోంది.. ఏదైతేనేం హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ తో ఉన్న విభేదాల కారణంగానే లోకేష్ ట్వీట్ చేయకుండా ఉన్నదనేది చాలామంది అభిప్రాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -