ఇప్పుడు కోట్లాది రూపాయలతో బేరం పెట్టి ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబుకు ఎన్నికల ఏడాది వచ్చిన వెంటనే చుక్కలు కనిపిస్తాయని జగన్ ఎప్పుడో హెచ్చరించాడు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఈ ఒక్క విషయంలోనే కాదు అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పులను ఎన్నింటినో ముందుగానే హెచ్చరించాడు జగన్. రుణమాఫీ హామీలు సాధ్యం కాదని ఎన్నికలకు ముందే చెప్పాడు. బాబు మాత్రం చేసి చూపిస్తానన్నాడు. హోదాకు బదులు ప్యాకేజ్ ఒప్పుకోవద్దు……. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చెయ్యొద్దు అని నెత్తీనోరు బాదుకుని చెప్పాడు జగన్. కానీ బాబు మాత్రం జగన్‌కి అవగాహన లేదు, అనుభవం లేదు అంటూ ప్యాకేజ్‌కి జై కొట్టాడు. ఇప్పుడు ప్యాకేజ్ పేరు చెప్పి కేంద్రం నిండా ముంచిందని పశ్ఛాత్తాపం వ్యక్తం చేస్తున్నాడు. ఇక సీట్ల పెరగడం ఉండదు…. ఇప్పుడు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను, ఎంపిలను కొంటున్న బాబు ఎన్నికల సంవత్సరంలో ఫలితం అనుభవిస్తాడు అని కూడా జగన్ చెప్పాడు.
ఇప్పుడు అదే జరుగుతోంది. ‘ఆత్మసాక్షిగా చెప్తున్నా…టిడిపికి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేను నేను…..అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు….బాబు చేస్తున్న అభివృద్ధి చూసి టిడిపిలో చేరుతున్నామని అందరూ చెప్తున్నారు. వాళ్ళమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను..నేను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనే.’అని కర్నూలు జిల్లా కోడూరు ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరపున పోటీ చేస్తే ప్రజలు 53వేల మెజారిటీ ఇచ్చారని, బాబు కంటే నాకే ఎక్కువ మెజారిటీ వచ్చిందని…….కానీ ఇప్పుడు పార్టీ మారాక 2019లో గెలిచే అవకాశమే లేదని, నా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు మణిగాంధీ.
ఇక మరోవైపు అరకు ఎంపీ కొత్త పల్లి గీత వైకాపా అధినేత జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైకాపా నుంచి టిడిపిలోకి జంప్ చేసిన ఈ ఎంపి ఇప్పుడు మళ్ళీ వైకాపాలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మోడీ, చంద్రబాబులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే స్థాయిలో గీత తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వళ్ళ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడతాననే చంద్రబాబు బిచ్చగాళ్ళ మాదిరిగా కేంద్రం వద్ద సాగిలపడుతుండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొంతమంది లాబీయింగ్ చేసి రైల్వేజోన్‌ని విజయవాడకు తరలించాలనుకుంటున్నారని, అందుకే వైజాగ్‌కి జోన్ రావడం లేదని విమర్శించారు. కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని…అందుకే కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావడం లేదని విమర్శలు చేశారు.
ఏది ఏమైనా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఒక జంపింగ్ ఎమ్మెల్యే, జంపింగ్ ఎంపీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రానికి ఏమీ ఇవ్వకపోయినా ఫర్వాలేదు ….సీట్లు మాత్రం పెంచండి అని రీసెంట్‌గా మోడీని కలిసినప్పుడు కూడా బాబు మొత్తుకున్నాడు. అయితే మోడీ మాత్రం రాజకీయ స్వార్థం కోసం రాజ్యాంగ సవరణ స్థాయి నిర్ణయాలు ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించాడు. అందుకే మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు లీకేజ్ పోరాటం డ్రామాలు చేస్తున్నాడు. ఆ విషయం పక్కనపెడితే ఫిరాయింపు రాజకీయాలతో బాబు ఫలితం అనుభవిస్తాడు అని చెప్పిన జగన్ మాటలు మాత్రం ఇఫ్పుడు అక్షరసత్యాలు అవుతున్నాయి.
2014ఎన్నికల ముందు నుంచి చూస్తే హోదాతో సహా అన్ని విషయాల్లోనూ జగన్ ముందుగానే బాబును హెచ్చరించాడు. కానీ బాబు మాత్రం ప్రపంచానికి పాఠాలు చెప్పా, జగన్‌కి ఏమీ తెలియదు, నేను అనుభవజ్ఙుడిని అని గొప్పలు చెప్పుకుంటూ నిర్ణయాలు తీసుకుని తాను మునగడంతో పాటు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా ముంచాడన్నది నిజం.
