Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌జ‌ల‌కు మ‌రో గార‌డివిద్య‌ను చూపిస్తున్న చంద్ర‌బాబు..

- Advertisement -

సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జ‌ల‌ముందు మ‌రో గార‌డి విద్య‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నాడు.ఇన్నాల్లు అమ‌రావ‌తికి అదిచేస్తా..ఇది చేస్తా ని చెప్పిన మాట‌లు స‌క్సెకాలేక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రొ కొత్త ప‌ల్ల‌విని అందుకున్నారు.ఆచ‌ర‌సాధ్యంకాని ప్రాజెక్టును సీఆర్డీయే సమీక్ష సమావేశంలో క సైన్స్ ఫిక్షన్ వంటి రవాణా విధానాన్ని.. ఆయన ఆమోదించారు.

అమరావతి నుంచి విశాఖకు 23 నిమిషాల్లోను, తిరుపతికి 25 నిమిషాల్లోను చేరుకోగల సరికొత్త రవాణా వ్యవస్థను ఇక్కడ ఆవిష్కరిస్తాం అంటూ బాబు మ‌రో సారి ప్ర‌జ‌ల చెవిలో పువ్వులు పెట్ట‌బోతున్నారు.హైపర్ లూప్ టెక్నాలజీ అనేది 2013లోనే పుట్టిన సరికొత్త రవాణా ఆలోచన.ఇది ఆచ‌ర‌న‌లో సాధ్యం కాక‌పోవ‌చ్చు.

అమరావతి నుంచి విశాఖకు ఒక స్ట్రెయిట్ లైన్ (సరళరేఖ) లాంటి వంతెన నిర్మిస్తారు. మామూలు రోడ్లకంటె బాగా ఎత్తులో ఉండేలా పిల్లర్లు వేసి.. స్కేలుతో గీత గీసినట్లుగా ఎలాంటి మలుపులు లేకుండా ఈ వంతెన ఉండాలి. దాని మీద ఒక పెద్ద గొట్టం లాంటిది అమరుస్తారు. ఆ గొట్టంలో మనం ప్రయాణించే వాహనం ఒక ట్యూబ్ ఆకృతిలో ఉంటుంది.

గంటకు 970 కిమీల వేగంతో ప్రయాణం చేయవచ్చునని దాన్ని ఏర్పాటు చేసే సంస్థ చెబుతోంది.పంచంలో ఎక్కడా ఇది ఇప్పటిదాకా ఏర్పాటు కానేలేదు. కాలిఫోర్నియాలో సంస్థ హెడ్ క్వార్టర్స్ వద్ద కూడా మోడల్ ను పరిశీలించే నిమిత్తం కంపెనీ వారే ఒక ట్రాక్ ఏర్పాటు చేశారు. అది కేవలం 1.6 కిలోమీటర్ల పొడవు మాత్రమే. అంత చిన్న శాంపిల్ ను గమనించి.. మన రాష్ట్రంలో వందల కిలోమీటర్ల పొడవునా.. భూముల్ని సదరు సంస్థకు మనం కట్టబెట్టాలన్నమాట.

హైపర్ లూప్ ప్రయాణం అనేది కేవలం మాయ మాత్రమే అని.. సినిమాల్లో పెట్టుకోడానికి చక్కగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ఊహ‌ల్లోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అవ‌స‌ర‌మ‌య్యే ప్రాజెక్టుల‌పైన దృష్టిసారిస్తె బావుంట‌నేది ప్ర‌జ‌ల అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -