Sunday, May 5, 2024
- Advertisement -

కాంగ్రెస్‌తో పొత్తుల‌పై ఎవ‌రూ మాట్లాడొద్దు… చంద్ర‌బాబుదే ఫైన‌ల్…

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో టీడీపీ క‌ల‌సి పోటీ చేస్తుంద‌నే వార్త‌లు కొద్ది రోజులుగా రాష్ట్రంలో ర‌చ్చ‌ర‌చ్చ చేస్తున్నాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కాంగ్రెస్ వైపు అడుగులు బాబు వేస్తున్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌ష్య‌మే. క‌ర్నాట‌క‌లో కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారాణికి వెల్లిన స‌మ‌యంలో రాహుల్‌తో క‌ల‌సి అభివాదం చేశారు. అమ‌రావ‌తిలో మంత్రుల‌తో బాబు స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుంద‌నే దానిపై చర్చించారు. మెజారిటీ మంత్రులు పొత్తువైపే మొగ్గు చూప‌డంతో బాబు ప‌రోక్షంగా పార్టీ శ్రేణుల‌కు పొత్తు సంకేతాలిచ్చారు.

అయితే కాంగ్రెస్‌తో టీడీపీపొత్తుపై ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్ర‌లు కేయీ, అయ్య‌న్న ఇంతెత్తున లేచి వ్య‌తిరేకించారు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీపొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు అయ్య‌న్న‌. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తరిమికొట్టాలన్న ఏకైక ఉద్దేశంతో ఎన్టీఆర్ తెలుగగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అలాంటి కాంగ్రెస్ తో పొత్తు అంటే అంతకంటే దుర్మార్గం ఏమీ ఉండదన్నారు. ఇక మ‌రో సీనియ‌ర్ మంత్రి కేయీకూడా పూర్తిగా వ్య‌తిరేకించారు.

ఇద్ద‌రు మంత్రుల‌కు ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు పార్టీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్‌. పార్టీలో ఏనిర్ణ‌య‌మైనా చంద్ర‌బాబుదే తుదిఫ‌న‌ల్‌. బాబు మాటే వేదమని సీనియర్లు అంద‌రికీ తెలిసిందే. నామినేటెడ్ పదవుల వంటి చిన్న విషయాలలోనే బాబు ఒకటికి పదిమార్లు ఆలొచించి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు బేరీజు వేసి ఎంపిక చేస్తూంటారు. అపుడు కూదా మిగతా నాయకులు ఉత్సవ విగ్రహాలే. ఇక పార్టీకే కీలకమైన పాలసీ డెసిషన్లపై అధినేత మాటే శిరోధార్యం. అక్క‌డ రెండవ మాటకే తావు ఉండదు.

కాంగ్రెస్‌తో పొత్తుపై పార్టీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావ్‌తో చెప్పించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తులపై జరుగుతున్న రచ్చపై కాస్తా ఘాటుగానే స్పందించారు. పొత్తుల ఎత్తులన్నీ హైకమాండే చూసుకుంటుందని కళా అనడం విశేషం. ఎపుడు ఏంచేయాలన్నది బాబుకు బాగా తెలుసన్న ఆయన పొలిట్ బ్యూరోలో చర్చించి బాబు ఫైనల్ గా నిర్ణయిస్తారని తేల్చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తుపై చంద్ర‌బాబే క‌ళా వెంక‌ట్రావ్ ద్వారా ఇద్ద‌రు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేయీ క్రిష్ణమూర్తిలకు ఇండైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చినట్లైంది . మొత్తానికి చూసుకుంటే పొత్తులపై ఇకపై ఎవరూ నోరు చేసుకోకుండా కళా వెంకట రావు ద్వారా బాబు గట్టి వార్నింగ్ ఇప్పించారంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -