Saturday, May 4, 2024
- Advertisement -

బూస్టింగ్ కోసమే ఇన్ని దరఖాస్తులా!

- Advertisement -

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్‌ను 115 మందితో ప్రకటించగా కాంగ్రెస్ కూడా దరఖాస్తుల ప్రక్రియ స్వీకరించింది. స్క్రీనింగ్ కూడా జరిగింది. అయితే కొన్ని చేరికల నేపథ్యం, అసంతృప్తుల నేపథ్యంలో లీస్ట్‌ ప్రకటించడం వాయిదా వేసింది హస్తం పార్టీ.

ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల రేసులో వెనుకబడ్డామని భావించిందో ఏమో తెలియదు కానీ బీజేపీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అయితే వారం రోజుల్లో వివిధ స్ధానాలకు 3300 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దరఖాస్తులతో పోలీస్తే ఇది రెండు రేట్లు ఎక్కువ.

వేల దరఖాస్తులు వచ్చినా పార్టీలోని ప్రముఖులు ఎవరెవరు ఎక్కడి నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారన్నది ఇంకా సస్పెన్సే. సీనియర్ల విషయంలోనే క్లారిటీ లేదు కానీ ఇంతమంది ఎందుకు దరఖాస్తు చేసుకుంటున్నారో అర్ధంగాక నేతలే తలలు పట్టుకుంటున్నారట. అయితే బీజేపీ నేతలు మాత్రం మీడియాలో బూస్టింగ్ ఇవ్వడానికేనని, అలాగే ఇన్ని వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పుకునేందుకు తప్ప ఏం ఉపయోగం లేదని గుసగుసలాడుతున్నారు.

అయితే బీజేపీ టికెట్ కోసం ఇన్ని దరఖాస్తులు రాకపోవడానికి కారణం ఫీజు లేకపోవడమే. అదే కాంగ్రెస్‌ పార్టీకి అయితే జనరల్ సీటుకు లక్ష, బీసీ కేటగిరి సీటుకు 50 వేలు,రిజర్వ్‌డ్ స్ధానాలకు 25 వేలు. కానీ బీజేపీ మాత్రం దరఖాస్తు కోసం ఎలాంటి ఫీజు లేదు. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అయితే 119 స్ధానాల్లో గట్టిగా పోటీ ఇచ్చే స్ధానాలు ఎన్నంటే బీజేపీ నేతలే చెప్పలేకపోతున్నారు. ఇక మరికొంతమంది నేతలైతే గెలిచే సంగతి పక్కన పెడితే ఎన్ని స్ధానాల్లో డిపాజిట్ వస్తుందో తెలియదు..ఈ క్రమంలో ఎంతమంది దరఖాస్తు చేస్తే ఏంటి అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -