Saturday, May 4, 2024
- Advertisement -

అందుకే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ద‌ప‌డ‌టంలేదా…

- Advertisement -

జ‌న‌సేప పార్టీ ఛీప్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడొ ప్ర‌భంజ‌నం. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ,భాజాపా కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి పాపుల‌ర్ అయ్యారు. త‌ర్వాత సొంతంగా జ‌న‌సేప పార్టీని స్థాపించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. అయితే వ‌చ్చె ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కీరోల్ అవుతారంటున్న వార్త‌లు బ‌లుపు మాత్ర‌మే అంటున్నారు.

ఏదైనా గుప్పెట్లో ఉన్నంత వ‌ర‌కే ర‌హ‌స్యం..ఇప్పుడు ప‌వ‌న్ కూడా అలాంటి సూత్రాన్నె అనుస‌రించి రాజ‌కీయాలు చేస్తున్నారు. తాను బలవంతుడిని మీడియా చేస్తున్నప్రచార వాపు త‌ప్ప మ‌రేమిలేద‌న్న‌ది తెలుస్తోంది. పవన్‌ సొంతంగా పోటీ చేస్తే 3.8 శాతానికి మించి ఓట్లు రావని ఆంధ్రజ్యోతి సర్వే .. ఒకటిన్నర శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదని కేసీఆర్‌ చెప్పినా పవన్‌ ఎక్కడా ఉలిక్కిపడుతున్నట్టు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు.

గ‌తంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో ఫలితం తారుమారై చంద్రబాబు సీఎం అయ్యారంటే అందుకు కారణం పవన్‌ కల్యాణేనంటూ జరుగుతున్న ప్రచారమే పవన్‌ కల్యాణ్‌కు అదనపు బలం.2019కి ముందు వరకు తన బలమెంత అన్నది బ్రహ్మపదార్థంగానే ఉండాలని పవన్ కల్యాణ్‌ కోరుకుంటున్నారు. అందుకే ఆయన ఏ ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధపడడం లేదు. కానిబలాన్ని దాచడమే తన బలంగా పావులు కదుపుతున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో గానీ, త్వరలో జరగపోయే కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గానీ పవన్ పార్టీ పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే జనసేన గెలుస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదు. కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే కేసీఆర్‌ చెప్పినట్టు పవన్ కల్యాణ్‌కు ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే వస్తే… ఇక ఆయన్ను ఏ పార్టీ కూడా లెక్కలోకి తీసుకోదు. చంద్రబాబు కూడా పవన్‌ కోసం ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మర్యాదలు చేసే సన్నివేశం కనిపించదు.

ఇవ‌న్నీ ప‌వ‌న్‌కు ముందె తెలుసు కాబ‌ట్టే 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి చూసె దోర‌ని ప్ర‌ద‌ర్శించి ఏపార్టీతో నైనా పొత్తు పెట్టుకుంటె సీట్లు డిమాండ్ చేయ‌వ‌చ్చనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -