Monday, April 29, 2024
- Advertisement -

అంద‌రూ అలా చేస్తె నియేజ‌క వ‌ర్గ స‌మ‌స్య‌లు తీరుతాయి…

- Advertisement -

ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు రెండు సంవ‌త్స‌రాలు టైంఉంది. రాజీనామ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి టీడీపీలో ప్ర‌కంక‌న‌లు రేపారు. ఇంకేముంది వెంట‌నే సీఎం చంద్ర‌బాబు రంగంలోకి దిగ‌డం జేసీ దివాకర్‌రెడ్డి కోర్కెలు తీర్చడంతో మెత్త‌బ‌డ్డారు జేసీ. ఇదంతా బాగానె ఉంది. ఇన్నాల్లు నియేజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు గుర్తుకురాలేదా. ఇప్పుడు ఏకంగా బ్లాక్ మేయిల్ రాజ‌కీయాల చేస్తున్నారు.

పార్టీకి వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా ఖ‌టిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బాబు గ‌ర్వంగా చెప్పుకుంటుంటారు. కాని ఇప్పుడు బాబు నీతి ఏమ‌య్యింది. ఎందుకంటె జేసీని వ‌దులుకునె ప‌రిస్థితుల్లో లేరు చంద్ర‌బాబు. అందుకె జేసీ బ్లాక్ మేయిల్ రాజ‌కీయాల‌కు త‌లొగ్గారు. పార్టీలో ఇంకేవ‌రైనా ఈ మాట అంటె అమ్మో ఇంకేమైనా ఉందా. వెంట‌నే చంద్ర‌బాబు వార్నింగ్ ఇస్తారు. మ‌రి జేసీ విష‌యంలో బాబు మాత్రం త‌లొగ్గార‌నే చెప్పాలి.

దీనివెనుక మ‌రోహైడ్రామా ఉందండోయ్‌. నిజానికి 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత పెరుగుతుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే, రాజీ’డ్రామా’కి తెరలేపారనె వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఎలా చూసినా, జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబు వదులుకునే పరిస్థితి లేదు. అందుకే రాజీనామ పేరుతో ఓ రాయి అలా విసిరేశారు అంతె సీన్ పూర్తిగ మారిపోయింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ పదవిని త్యాగం చేయడానికే సిద్ధపడ్డ ఘనుడు.. అన్న ఘనత జేసీ దివాకర్‌రెడ్డి తన ఖాతాలో వేసుకోబోతున్నార్నమాట.

ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రంలో తన ఒక్క నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులు వున్నాయనీ, స్థానికంగా అలసత్వం తప్ప, ఈ ఇబ్బందికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు కానే కాదన్నది జేసీ దివాకర్‌రెడ్డి వాదన. మ‌రి అంద‌రూ శాఖాహారులు అయితే గంప‌కింద కోడి పెట్ట ఎలా మాయ‌మ‌యిన‌ట్లు అంటె దానికి స‌మాధానం ఉండ‌దు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ఉంద్ద‌రించేస్తున్న ప్పుడు త‌న నియేజ‌క వ‌ర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేక‌పోతున్నారొ . ఇలా అంద‌రూ బ్లాక్ మేయిల్ రాజ‌కీయీల‌కు దిగుతే ఇంకేముంది ఏపీలోని అన్ని నియేజ‌క వ‌ర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతాయ్‌. ఇదేదో బాగుంది క‌దూ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -