Sunday, May 5, 2024
- Advertisement -

తెలంగాణ టీడీపీలో కేసీఆర్ కోవర్టులు

- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో అన్ని పార్టీలు సుదీర్ఘ మంతనాలు, చర్చలు, పొత్తులు, ఎత్తులు, వ్యూహరచనలో మునిగిపోయాయి. ఎవరిని చేర్చుకోవాలి ? ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలో దించాలి ? అభ్యర్ధుల శక్తి సామర్థ్యాలు ఎంత ? ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎంత లాభం ? ఎంత నష్టం ? అని అంచనాలు వేసుకుంటున్నాయి. తమ పార్టీలో ఉన్న వారిని ఇతర పార్టీల్లో చేర్చాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారి ద్వారా ప్రత్యర్ధి పార్టీ రాజకీయ వ్యూహాలను గ్రహించి వారి కంటే ముందే ఎత్తుకు పై ఎత్తు వేయాలన్నది వారి మాస్టర్ ప్లాన్. ఇలాంటి కోవర్టు వ్యవస్థ అన్ని పార్టీలు అమలు చేసేదే. ఒక పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఆ పార్టీ వ్యూహప్రతివ్యూహాలను ఇతర పార్టీలకు అందజేస్తూ పబ్బం గడుపుకునే బ్యాచ్ ప్రతి చోటా ఉంటుంది.

గతంలో తెలంగాణ టీడీపీ నుంచి కొందరు కీలక నాయకులు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మిగిలిన మరికొందరు కూడా చేరడానికి సిద్ధమయ్యారు. కానీ కేసీఆర్ వారిని కొన్నాళ్లు టీడీపీలోనే ఉండాలని సూచిస్తూ, కావాలనే ఆ పార్టీలో ఉంచారు. అలా ఉంచి, వారి ద్వారా చంద్రబాబు వ్యూహప్రతివ్యూహాలు, టీటీడీపీ ఎత్తులు, అన్నీ తెలుసుకున్నారు. దాని ఫలితమే ఓటుకు నోటు కేసు వ్యవహారం లీక్. తెలంగాణ టీడీపీకి చెందిన అత్యంత విశ్వసనీయమైన, అతి కొద్ది మంది నేతల సమక్షంలో ఓటుకు నోటు వ్యవహారం గురించి నాడు చంద్రబాబు చర్చించారు. అన్ని పార్టీలు చేసినట్లే మన పార్టీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే తప్పేంటి ? అని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు సహా ఇతర నాయకులను ఉసి గొల్పారు. అలా చేస్తే బొటాబొటీ మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఆకర్షను తాము విజయవంతంగా డీల్ చేస్తాని బాబుతో సహా ఇతర తోటి టీడీపీ నేతలకు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను, టార్గెట్ చేసుకుని బేరసారాలు జరుపుతామని నమ్మబలికారు. దాదాపు టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉన్న నాయకులు అలా చెప్పేసరికి చంద్రబాబు సహా, రేవంత్ రెడ్డి కూడా వారి మాటలను నమ్మారు. అంతా కూడబలుక్కుని రంగంలోకి దిగారు.

సీన్ కట్ చేస్తే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్లు ఆఫర్ చేస్తూ రేవంత్ రెడ్డి సీక్రెట్ కెమేరాలకు దొరికి పోయారు. పకడ్బందీగా ఆయన వాయిస్ కాల్స్ తో సహా, వీడియో టేపులను ఆధారాలుగా చూపించి కేసీఆర్ తర్వాత రాజకీయం నడిపారు. ఇక్కడ తెలంగాణ టీడీపీ నేతలు, రేవంత్ రెడ్డి చేసిన పనిని సమర్ధించడం కాదు కానీ, అలాంటి బేరసారాలు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నవే. అయితే తెలంగాణ టీడీపీకి చెందిన కొందరు కోవర్టులు ఆ సీక్రెట్ ఆపరేషన్ ఆకర్ష్ గురించి కేసీఆర్ కి ఉప్పందించారు. అన్నా నేను టీఆర్ఎస్ లో చేరుతాను నాకు మంత్రి పదవి ఇవ్వు, ఇంక అన్ని రకాలుగా నన్ను చూసుకో…నీ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోంది. అని చెప్పి, మొత్తం గుట్టు రట్టు చేశారు. దీంతో కేసీఆర్ స్టీఫెన్ సన్ తో మాట్లాడి, తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులను రంగంలోకి దించి, రేవంత్ రెడ్డిని ఆధారాలతో సహా పట్టించాడు. ఆ లీక్స్ ఇచ్చింది యర్రబెల్లి దయాకర్ రావు అని తర్వాత రేవంత్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు. ఇక అప్పటి సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి రాజుకున్న సమయంలో టీటీడీపీ నేతల్లో ఎవరిని నమ్మాలో ? ఎవరిని నమ్మకూడదో ? తెలియని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామంటూ ఎవరు ఎవరికి కోవర్టుగా ఉన్నారో, ఎవరు ఎటు నుంచి పార్టీని మళ్లీ ముంచేస్తారో..? అర్ధం కాని స్థితిలో బాబు ఆచితూచి స్పందించాల్సి వస్తోంది. లేకుంటే అందరినీ నమ్మితే గతంలో ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నట్టే, ఇరుక్కుంటామేమోననే భయం ఆయనను వెంటాడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -