Tuesday, May 14, 2024
- Advertisement -

ప్యాకేజీల‌కోసం అయితే రాజ‌కీయాలు అవ‌స‌ర‌మా…? వ‌్యాపారాలు చేసుకోవ‌చ్చుక‌దా..?

- Advertisement -

క‌ర్నూలు జిల్లా వైసీపీ లొ నెల‌కొన్న రాజ‌కీయ గంద‌ర‌గోలానికి తెర‌ప‌డింది. ఆపార్టీ ఎంపీ బుట్టారేణుక టీడీపీలో చేరుతున్నార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చ‌ల్ చేశాయి. పార్టీ మారాలా వ‌ద్దా అని ఊగిస లాడుతున్న రేణుక ప‌చ్చ‌పార్టీ ఖండువ క‌ప్ప‌కున్నారు. ఇంత వ‌ర‌కు బాగానె ఉంది ఇంకా పార్టీ మార‌లేద‌ని చెప్పుకోవ‌డం హాస్యాస్ప‌దం.

చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ కూడా హాజరయ్యారు. అయితె మీడియాతో మాట్లాడుతున్న బుట్టారేణుక పార్టీ మారిన ప‌నిని స‌మ‌ర్థించుకోలేక నానా ఇబ్బందులు ప‌డ్డారు. ఫిరాయింపు నేత‌లందురు చెప్పిందే ఆమెకూడా అదే చెప్పారు. అభివృద్ధిని చూసె ఇక్క‌డికి వ‌చ్చాన‌ని చెప్పారు.

రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు చంద్రబాబు నిరంతరం ప్రయత్నిస్తున్నారని కితాబిచ్చారు. మూడున్నర ఏళ్లుగా తాను అభివృద్ది విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తూనే వస్తున్నానని చెప్పారు. మీరు టీడీపీలో చేరారా అని ఒక విలేకరి సూటిగా ప్రశ్నించగా బుట్టా రేణుక తడబట్టారు. తాను టీడీపీలో చేరలేదని చెప్పారు. తాను టీడీపీకి మద్దతు తెలపడం లేదని.. టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానన్న విషయం గుర్తించుకోవాలని చెప్పారు. పార్టీ మారాన‌నె చెప్పె

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన విష‌యం ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే. బయటకు వచ్చి తాను టీడీపీకి కాదు…. టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని చెప్పడంతో జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాను టీడీపీలో చేరానని చెబితే అర్హత వేటు గండం ఉంటుందేమోనన్న భయంతోనే బుట్టా రేణుక ఇలా మాట్లాడినట్టు భావిస్తున్నారు. అంటే ఆమె పార్టీ మారాన‌ని చెప్పే ధైర్యంకూడా లేద‌న్న‌మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -