Monday, May 6, 2024
- Advertisement -

మద్య ప్రదేశ్ లో జోరు కొనసాగిస్తున్న కమలం!

- Advertisement -

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​తో పాటు మధ్యప్రదేశ్​లో 28 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సగానికిపైగా స్థానాల్లో బిజేపి ఆధిక్యం కనబరుస్తోంది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలుండగా… బిజేపి ఖాతాలో ప్రస్తుతం 107 స్థానాలున్నాయి. ఈ ఉపఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిస్తే బిజేపి అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ ఖాతాలో ప్రస్తుతం 87 స్థానాలున్నాయి. ఈ ఉపఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ నుంచి బిజేపిలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్​కు చాలా ముఖ్యం.

ఛత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి మరణంతో మార్వాహిలో నవంబర్ 3న జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నడుస్తోంది.ఒడిశాలో రెండు స్థానాలకు గత వారం ఉపఎన్నికలు జరగ్గా.. వాటి కౌంటింగ్ కొనసాగుతోంది.

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

ఏలూరి కూడా జంపింగ్ లిస్టు లో ఉన్నాడే..?

ఢిల్లీ లో కేసిఆర్ ఒక్కడే ప్రతాపం చూపిస్తాడా..?

చంద్రబాబు కు తెలుగు తమ్ముళ్ళను కలిసే టైం కూడా లేదా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -