Thursday, April 18, 2024
- Advertisement -

ఢిల్లీ లో కేసిఆర్ ఒక్కడే ప్రతాపం చూపిస్తాడా..?

- Advertisement -

తెలంగాణ రావడంలో ఎంతో కీలక పాత్ర వహించిన కేసీఆర్ వెను వెంటనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కుంచుకుని ప్రజల క్షేమం కొరకు కొత్త పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ ను పరిపాలిస్తున్నాడు.. వరుసగా రెండో సారి ఆయన అధికారంలోకి వచ్చారంటే ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీ, నమ్మకం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.. దానికి తోడు ఆయన ప్రవేశ పెడుతున్న పథకాలకు కూడా జనాదరణ బాగా ఉండడంతో కేసీఆర్ 2024 ఎలక్షన్స్ లోనూ గెలుపు ఖాయం అని గులాబీ నేతలు జోస్యం చెప్తున్నారు.. అయితే గత ఎన్నికలనాటికి ఇప్పటికి కేసీఆర్ పాపులారిటీ బాగా తగ్గింది ఈసారి కారు జోరు చూపించడం కొంచెం కష్టమే అన్నవాళ్ళు లేకపోలేదు..

ఇక ఎన్నికల మొదటినుంచి కేసీఆర్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ లో పాల్గొంటున్నాడని అందుకే మోడీ పై విమర్శలు చేస్తూ దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు.. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పాలన బోర్ కొట్టిందని అందుకే ప్రజలు ఓ కొత్త ప్రభుత్వం కోసం చూస్తున్నారని అయన చెప్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..  అందుకోసం చాలామంది దేశ స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారని, అయినవారిని కానీ వారిని కలుపుకోయే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు..నిజానికి కేసీయార్ తన పార్టీకి ఢిల్లీలో ఒక స్థలం కావాలని 2018 లో కేంద్రానికి విన్నపం చేసుకున్నారు. ఆనాడు చూస్తే కేంద్రంతో కేసీయార్ మంచి దోస్తీ చేస్తున్నారు. కేంద్రంలోని పాలకుల చలువతో ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు కూడా పెట్టించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం తరువాత కేసీయార్ ప్లేట్ ఫిరాయించారు.

అయితే అదే ఇప్పుడు కేసీఆర్ ని కేంద్రంలో పాపులర్ చేస్తుందని చెప్పొచ్చు..  జాతీయ స్థాయిలో వెలిగేందుకు సరైన రూటే దొరికింది. పార్టీ ఆఫీస్ ని సాధ్యమైనంత త్వరగా నిర్మించి అక్కడకు ఆయన షిఫ్ట్ అవుతారు అంటున్నారు. అంటే రానున్న రోజుల్లో కేసీయార్ జాతీయ రాజకీయాన్ని చాలా పక్కాగా చేస్తారు అంటున్నారు. అంటే ఎక్కడ నుంచో ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రా భవన్ లో బస చేస్తూ బాబు చేసే టెంపరరీ రాజకీయం మాదిరిలా కాదన్నమాట.

కేసిఆర్ కవిత మంత్రి పదవి ఇస్తే జరిగే పరిణామాలు ఇవే..

టీఆర్ఎస్ అంతకుమించి ప్లాన్ చేసిందా..?

ఇప్పుడు మోడీ ఏపీ పై ప్రేమ కురిపిస్తున్నారే..

తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -