Tuesday, May 14, 2024
- Advertisement -

అందరి చూపు జనసేన వైపు.. పవన్ ప్లానెంటి ?

- Advertisement -

ప్రస్తుతం జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జనసేన పార్టీని లైట్ తీసుకున్న నేతలే ఇప్పుడు జనసేన వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల వరకు పవన్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తాడనే భావనతో గట్టిగా ఉండడంతో జనసేన క్యాడర్ చాలా బలహీనంగా ఉండేది. ఫలితంగా 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు తో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి పవన్ గేరు మార్చి పార్ట్ టైమ్ పాలిటిక్స్ అనే ముద్రను చెరిపెసే దిశగా అడుగులు వేశారు. గత మూడేళ్ళ కాలంలో ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పార్టీని క్షేత్ర స్థాయిలో బలపరిచేందుకు నిత్యం ప్రజల్లో ఉంటూ వచ్చారు.

జనవాణి, రైతు భరోసా యాత్ర, వంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు పవన్. ముఖ్యంగా కౌలు రైతులకు అండగా పవన్ నిలవడంతో అందరి దృష్టి జనసేనపై పడింది. ఫలితంగా పార్టీ క్యాడర్ బలపడుతూ వచ్చింది. ఇక ఇటీవల విశాఖ ఘటన తరువాత జనసేన క్రేజ్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఏకంగా చంద్రబాబే స్వయంగా పవన్ తో భేటీ కావడం.. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్నీ పార్టీలు కలిసి నడవాలని పవన్, చంద్రబాబు పిలుపునివ్వడంతో 2024 ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ సారి జనసేన ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. దాంతో ఇతర పార్టీలలోని అసంతృప్తి నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అటు టిడిపి నుంచి, ఇటు వైసీపీ నుంచి సీట్లు దక్కని నేతలకు జనసేన ఆశాకిరణంలా కనిపిస్తుండడంతో ఇప్పటికే కొందరు నేతలు పవన్ తో టచ్ లో ఉంటున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే జనసేన మొదటి నుంచి యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వలస వచ్చే సీనియర్ నేతలకు సీట్ల కేటాయింపులో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటడనేది ఇప్పుడే చెప్పలేం. అంతే కాకుండా జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది అనే దానిపై కూడా జనసేనాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వలస నేతలకు జనసేనాని ఎలాంటి ప్రదాన్యం ఇస్తాడనేది పోలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ. ఏది మేమైనప్పటికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

హిందుత్వ రాజకీయం.. మోడీకి చెక్ !

బీసీలపై జగన్ ప్రేమ.. వర్కౌట్ అవుతుందా ?

టి‌ఆర్‌ఎస్ పై బీజేపీ చేస్తోన్న కుట్రలు నిజమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -