Thursday, May 2, 2024
- Advertisement -

హిందూ రాజకీయం.. మోడీకి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ !

- Advertisement -

మనదేశం సర్వమతల సమ్మేళనం అయినప్పటికి.. మేజర్ గా హిందువులు అధికంగా ఉండడంతో హిందూ దేశంగా పిలువబడుతోంది. దాంతో హిందువులను ఆకర్షిస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం నల్లేరు మీద నడకే అవుతుంది. ఇదే సూత్రాన్ని మొదటి నుంచి పాటిస్తోంది కాషాయ పార్టీ బీజేపీ. కేవలం హిందూ ప్రాతిపాదికనా మతానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. ముఖ్యంగా హిందువులను ఆకర్శించేందుకే మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలు రచిస్తుంటారు. అయితే బీజేపీ వైఖరి మతవిద్వేషాలను రేకెత్తించే విధంగా ఉంటుందని విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికి, మోడీ- అమిత్ షా ద్వయం మాత్రం కేవలం హిందువులకు, హిందూ మతాలకు మాత్రమే అధిక ప్రధానం ఇస్తూ వచ్చింది.

దీంతో హిందూ ఓటు బ్యాంకు అంతా కూడా బీజేపీ గుప్పిట్లో ఉంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ ఫార్ములానే 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టడంలో కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తాజాగా బీజేపీ ఫార్ములాను తన ఫార్ములాగా మార్చుకొని ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు డిల్లీ ముఖ్యమంత్రి కేజృవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దేశ రాజకీయాల్లో మెల్లమెల్లగా పరిధిని పెంచుకుంటూ బీజేపీకి ధీటైన ప్రత్యర్థిగా ఎదిగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ విధాలుగా ప్రయత్నిస్తోంది. ఆ మద్య పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చిన ఆప్, నెక్స్ట్ జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా సత్తా చాటి ఆప్ ను జాతీయ పార్టీగా నిలబెట్టేందుకు కేజృవాల్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హిందువులను ఆకర్షిస్తే బీజేపీ గుప్పిట్లో ఉన్న హిందూ ఓటు బ్యాంకును ఆప్ కు సానుకూలంగా మార్చుకుందుకు కేజృవాల్ ప్లాన్ వేశారు. ఎందుకంటే ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుంది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీతో పాటు, లక్ష్మిదేవి, వినాయకుడి చిత్రాలు కూడా ఉండాలని సంచలన డిమాండ్ ను లేవనెత్తారు కేజృవాల్. ఒకవేళ ఎన్నికల ముందు స్వతహాగా బీజేపీ కరెన్సీ నోట్లపై లక్ష్మిదేవి, వినాయకుడి చిత్రాలు ముద్రించడానికి పునుకుంటే ఆ క్రెడిట్ మాత్రం కేజృవాల్ కే వెళుతుంది. ఇక మత సామరస్య వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అది బీజేపీకి గట్టి దేబ్బే. ఏది ఏమైనప్పటికి బీజేపీ వల్లించే హిందూ మంత్రాన్ని..కేజృవాల్ అందుకోవడంతో దేశంలో కాషాయ రాజకీయాలు పెరిగిపోతున్నాయని ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బీసీలపై జగన్ ప్రేమ.. వర్కౌట్ అవుతుందా ?

పవన్ను తక్కువగా అంచనా వేసిన జగన్..!

టి‌ఆర్‌ఎస్ పై బీజేపీ చేస్తోన్న కుట్రలు నిజమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -